ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

కాలేయం సరిగ్గా పని చేస్తున్నప్పుడు, కాలేయం యొక్క ప్రధాన పని జీర్ణాశయం నుండి వచ్చే రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు పంపే ముందు ఫిల్టర్ చేయడం. కాలేయం రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మందులను జీవక్రియ చేస్తుంది.

ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

liver disease

శరీరంలో లివర్‌ అనేది చాలా ముఖ్యమైన అవయవం. కాలేయ వైఫల్యం అనేది ప్రాణాంతక పరిస్థితి. దీనికి అత్యవసర వైద్య సంరక్షణ అవసరం. కాలేయ వైఫల్యం అనేది అప్పటికప్పుడు జరిగేదికాదు. చాలా సంవత్సరాలుగా క్రమంగా జరుగుతుంది. ఇది అనేక కాలేయ వ్యాధుల చివరి దశ. అయితే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అని పిలవబడే అరుదైన పరిస్థితి చాలా వేగంగా జరుగుతుంది. 48 గంటలలోపు గుర్తించడం కష్టం. కాలేయం మరమ్మత్తు చేయలేనంతగా దెబ్బతిన్నప్పుడు , కాలేయం ఇకపై పనిచేయలేనప్పుడు కాలేయ వైఫల్యం సంభవిస్తుంది.

READ ALSO : Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్

ప్రత్యక్ష వైఫల్యం రెండు రకాలు:

1. తీవ్రమైనది: ఇది కాలేయం కొన్ని రోజులు లేదా వారాల వ్యవధిలో పనిచేయడం మానేస్తుంది. అంతకు ముందు నుండే ఇలాంటి వారిలో కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఏమీ ఉండవు.

2. దీర్ఘకాలికమైనది: కాలేయానికి నష్టం కాలక్రమేణా పెరుగుతుంది. దాని పనిని ఆపివేస్తుంది.

కాలేయ వ్యాధి, కాలేయ వైఫల్యం యొక్క లక్షణాలు ;

కాలేయ వైఫల్యం ప్రారంభ లక్షణాలు కాలేయ వ్యాధులు ,ఇతర పరిస్థితులను బట్టే ఉంటాయి. దీని కారణంగా, కాలేయ వైఫల్యాన్ని మొదట నిర్ధారించడం చాలా కష్టం. ప్రారంభ లక్షణాల గురించి పరిశీలిస్తే వికారం, ఆకలి లేకపోవడం, అలసట, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయ వైఫల్యం చెందేకొద్దీ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి. కామెర్లు, రక్తస్రావం, ఉబ్బిన బొడ్డు, మానసిక గందరగోళం, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

READ ALSO : Cow Dairy : ఆవుల డెయిరీ నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్

కాలేయం సరిగ్గా పని చేస్తున్నప్పుడు, కాలేయం యొక్క ప్రధాన పని జీర్ణాశయం నుండి వచ్చే రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు పంపే ముందు ఫిల్టర్ చేయడం. కాలేయం రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మందులను జీవక్రియ చేస్తుంది. అలా చేయడం వలన, కాలేయం పిత్తాన్ని స్రవిస్తుంది, అది తిరిగి ప్రేగులలో చేరుతుంది. రక్తం గడ్డకట్టడం ఇతర విధులకు కాలేయం ప్రోటీన్లను అందించటం వంటివి చేస్తుంది.

READ ALSO : Protein Foods : వీటిలో ఉండే ప్రొటీన్ ఎంత మంచిదో తెలుసా.. తింటే ఎన్ని ప్రయోజనాలో !

అయితే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల లివర్‌ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అనేది నాలుగు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ఇన్‌ఫ్లమేషన్ , రెండోది ఫైబ్రాసిస్‌ మూడోది సిర్రోసిస్‌ చివరగా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. సిరోసిస్ దశకు చేరటానికి చాలా ఏళ్లు పడుతుంది. చివరకు లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈ దశలో లక్షణాలకు సంబంధించి చాలా తీవ్రస్ధాయిలో ఉంటాయి. రక్త స్రావం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం , విపరీతమైన దురద, ఆకలి లేకపోవడం, వికారం, కాళ్లు, పొత్తికడుపులోకి ద్రవం చేరి వాపు రావడం, ఏకాగ్రత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మూడో దశలో వైద్యులు డ్యామేజ్ అయిన లివర్ స్థానంలో ఒక ఆరోగ్యవంతుడైన అవయవ దాత నుంచి సేకరించిన లివర్‌ను మార్పిడి చేస్తారు.