Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్

వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.

Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్

Madan Lal photos viral

Updated On : August 20, 2023 / 12:10 PM IST

Madanlal Intimate With Woman Photos : ఖమ్మం జిల్లా వైరా రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వ్యక్తిగత ఫోటోలు వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంంగా ఉన్న ఫోటోలను ప్రత్యర్థి వర్గం వైరల్ చేస్తోంది. వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి లిస్టులు ప్రకటించే నేపథ్యంలో వైరా నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఒక్కసారిగా
బీఆర్ఎస్ పార్టీలో కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వైరల్ చేస్తూ ప్రత్యర్థి వర్గాలు ప్రచారం కొనసాగిస్తున్నాయి.

Liquor Tenders : తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్య స్పందన.. ఏకంగా 1,31,490 దరఖాస్తులు

ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూప్ ల్లో ఫొటోలను పూర్తిగా వైరల్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ విషయంపై మదన్ లాల్ వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఈ ఫొటోల వ్యవహారాన్ని ఇప్పుడు ప్రత్యర్థి రాములు నాయక్ కు చెందిన వర్గం బాగా వైరల్ చేస్తోందని మదన్ లాల్ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు.

రేపు (సోమవారం) సీఎం కేసీఆర్ మొదటి లిస్టు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ కు టికెట్ రావడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన వర్గీయులు మదన్ లాల్ కు టికెట్ కన్ఫామ్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అధికార బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య వైరుధ్యం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకుంటూనే ఒక మహిళతో మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోను వైరల్ చేస్తున్నారు.

Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఈ విషయంపై మదన్ లాల్ వర్గీయులు సీరియస్ గా ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని మదన్ లాల్ వర్గీయులు చెబుతున్నారు. కావాలనే సోషల్ మీడియా వేదికగా ఫొటోలను వైరల్ చేస్తూ తమ నేతను ఇబ్బందుల పాలుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.