gastric problems
Gastric Problems : రుతుపవనాలు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తాయి, అయితే వర్షకాలంలో ముఖ్యంగా జీర్ణశయాంతర (GI) వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉత్పన్న అయ్యే అవకాశాలు చాలా మందిలో అధికంగా ఉంటాయి. తేమతో కూడిన వాతావరణం వ్యాధికారక కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆహార కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో GI సమస్యలను నివారించడానికి, గట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : Tiger Nuts : డయాబెటిస్ నియంత్రణలో ఉంచే టైగర్ నట్స్ !
వర్షాకాలంలో పొట్ట ఫిట్‌గా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాలు :
అధిక తేమ కారణంగా, ఆహార పదార్థాలు త్వరగా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజా ఉత్పత్తులు , ఆహారాలను తినేందుకు ఎంచుకోవాలి. వాటిని ఎక్కువసేపు నిల్వ చేయకూడదు. పాచిపోయిన, మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోవాలి.
వర్షాల సమయంలో రుచికరమైన వీధి అంగట్లో లభించే చిరుతిళ్లను తీసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వీధిలో లభించే ఆహారం తినటం వల్ల ఇన్‌ఫెక్షన్‌లు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇంట్లో వండిన ఆహారానికి తీసుకోవటం మంచిది. బయటి ఆహారం తీసుకోవాలనుకుంటే పరిశుభ్రమైన ఫుడ్ అవుట్‌లెట్‌లను ఎంచుకోవటం మంచిది.
READ ALSO : Bandi Sanjay: కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన బండి సంజయ్.. ఆ తర్వాత ట్వీట్ చేసి..
వర్షకాలంలో వ్యాధికారక క్రిముల పెరుగుదల అధికంగా ఉండే అవకాశాలు ఉన్నందున తినటానికి ముందు చేతులను సబ్బు నీటితో తరచుగా కడుక్కోవడం ద్వారా మంచి పరిశుభ్రతను పాటించాలి. హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజంతా ఫిల్టర్ చేసిన నీటిని తీసుకోవాలి.
ఆహారంలో ప్రోబయోటిక్స్ , సౌర్‌క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో గట్ ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచే వేప మరియు తులసి వంటి రోగనిరోధక శక్తిని పెంచే మూలికలను రోజువారిగా తీసుకోవాలి. ఈ మూలికలు శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి , జీర్ణవ్యవస్థను రక్షించడంలో సహాయపడతాయి.
READ ALSO : Friendship Day Gifts : బంధాలు బలపడాలంటే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలి
ఈ చిట్కాలన్నీ సహాయకరంగా ఉన్నప్పటికీ, మంచి ఆరోగ్యానికి, బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి తగినంత నిద్ర , విశ్రాంతి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యకరమైన పోషకాహారం. క్రమం తప్పకుండా వ్యాయామం కొనసాగించాలి. దీని వల్ల వర్షాకాలంలో జీర్ణవ్యవస్థను, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వర్షాల సీజన్ అంతటా మెరుగైన రోగనిరోధక శక్తికి ఈ చిట్కాలు దోహదం చేస్తాయి.