Bandi Sanjay: కుటుంబ సమేతంగా మోదీని కలిసిన బండి సంజయ్.. ఆ తర్వాత ట్వీట్ చేసి..

ఇటీవలే బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే.

Bandi Sanjay: కుటుంబ సమేతంగా మోదీని కలిసిన బండి సంజయ్.. ఆ తర్వాత ట్వీట్ చేసి..

Bandi Sanjay - Narendra Modi

Updated On : August 3, 2023 / 3:33 PM IST

Bandi Sanjay – Narendra Modi: బీజేపీ (BJP) తెలంగాణ (Telangana) అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బండి సంజయ్ ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీని కలిసిన ఈ రోజు మర్చిపోలేనిదని పేర్కొన్నారు. మోదీ తన కుటుంబం కోసం కేటాయించిన ప్రతి క్షణాన్ని తన జీవితకాలం పాటు ఓ బహుమతిగా భావిస్తూనే ఉంటానని తెలిపారు.

ఇటీవలే బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్ తో మిత్ షా చర్చించారు. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని బండి సంజయ్ కు అమిత్ షా చెప్పారు.

బండి సంజయ్‌ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి బండి సంజయ్ చేరుకుంటారు. బండి సంజయ్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Manipur violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. 17 మందికి తీవ్రగాయాలు, రాజధాని ఇంఫాల్‭లో కర్ఫ్యూ