Eggs Cholesterol Truth : గుడ్లు తింటే నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అసలు రోజుకు ఎన్ని తినొచ్చు? ఈ స్టోరీ చదివాక మీకే తెలుస్తుంది!

Eggs Cholesterol Truth : కోడిగుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. దీనిపై అనేక అపోహలు ఉన్నాయి. గుడ్లు ఎవరు తినచ్చు ఎవరు తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Eggs Cholesterol Truth

Eggs Cholesterol Truth : కోడిగుడ్డులో అనేక ప్రొటీన్లు ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తుందని అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ పూర్తి గుడ్డును తినవచ్చు. వారంలో 7 గుడ్ల నుంచి 10 గుడ్ల వరకు తినవచ్చునని న్యూట్రిషన్లు కూడా చెబుతున్నారు. అదే వ్యాయామం చేసేవారు, క్రీడాకారులకు ఎక్కువ ప్రొటీన్లు అవసరం కనుక వారు రోజుకు 4 నుంచి 5 గుడ్లు తినవచ్చునని వైద్యులు చెబుతున్న మాట.

అయితే, సమస్య ఏంటంటే.. అధిక చెడు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు ఈ కోడిగుడ్లను రోజు తమ ఆహారంలో చేర్చుకోవచ్చా లేదా అనేది.. చాలామందిలో ఇదే డౌట్ ఉంటుంది. నిజానికి గుడ్డు తింటే కొలస్ట్రాల్ పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమేనని పోషక నిపుణులు సైతం చెబుతున్నారు.

Read Also : JioMart Offers : కొత్త ఏసీ కొంటున్నారా? జియోమార్ట్‌లో సగం ధరకే ఏసీలు.. 3 టాప్ బ్రాండ్ల ఏసీలు మీకోసం..!

కోడిగుడ్డును పూర్తిగా తింటే అందులో 13 గ్రాముల వరకు ప్రోటీన్లు అందుతాయి. గుడ్డులోని వైట్ మాత్రమే తీసుకుంటే మాత్రం 6 గ్రాముల ప్రోటీన్స్ పొందవచ్చు. కానీ, గుడ్డును నార్మల్‌గా తీసుకోవాలి తప్పా దానికి బటర్, క్రీంలు పూసేసి తినొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వీరు గుడ్లను తినకపోవడమే మంచిది :
హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వాళ్లు గుడ్డు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళా తిన్నా వైట్ మాత్రమే తిని పచ్చ సొన తినకూడదు. పచ్చ సొనలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అదే తెల్ల సొనతో ఆరోగ్యానికి హాని పెద్దగా ఉండదని చెబుతారు.

డయాబెటిస్ వాళ్లు ఆహారంలో గుడ్డును తీసుకుంటే తప్పనిసరిగా వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి. వారంలో 2 లేదా 3 గుడ్లు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. కిడ్నీ ఫైయిల్ అయిన బాధితులు కోడిగుడ్డు తీసుకోవచ్చుని, ఎదిగే పిల్లలు గుడ్డు తీసుకోవచ్చునని చెబుతున్నారు.

గుడ్డుతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? :
గుడ్డు ఆరోగ్యమని తెగ తినేయకూడదు. ఏది తిన్నా పరిమితంగానే తీసుకోవాలంటారు. గుండెకు కూడా గుడ్డు చాలా మంచిదట. గుడ్డు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని భయపడిపోతుంటారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే వారు లిమిట్‌గా తీసుకోవచ్చు.

ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్నవారు అసలు గుడ్ తినకపోవడమే మంచిదట. గుడ్డులోని పచ్చసోనలో స్టోరహౌస్ అనే పదార్థం ఉంటుంది. ఇద కొలెస్ట్రాల్ లెవల్ ఎక్కువగా పెంచుతుంది. అందుకే గుడ్లు తినవద్దని చెబుతుంటారు. అంతేకానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు నిర్భయంగా కోడిగుడ్లను తినవచ్చు.

రోజుకు ఎన్ని గుడ్లు తినాలంటే? :
రోజుకు ఎన్ని గుడ్లు తినాలంటే.. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే రోజుకు ఒక గుడ్డు తిన్నా సరిపోతుంది. రోజుకు ఎన్ని గుడ్లు తిన్నామనేది ముఖ్యం కాదు.. ఉడకబెట్టిన గుడ్లను ఎలా తీసుకుంటున్నాము అనేది ముఖ్యం. మీరు కోడిగుడ్డును తినే సమయంలో దానికి చీజ్, బేకన్, సాస్, మఫిన్, వెన్నతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేస్తే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్ అమాంతం పెరిగిపోతాయి అనమాట..

Read Also : Money Attract Tips : చాణక్యుడి ఈ 5 సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.. వద్దన్నా వస్తూనే ఉంటుంది.!

అందుకే కోడిగుడ్డును తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనడానికి ప్రధానం కారణం.. సో.. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. అది వేటితో కలిపి తింటున్నాము అనేది ఇక్కడ గుర్తించాలి. మీ స్టోరీ మొత్తం చదివిన తర్వాత మీ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే కదా..