JioMart Offers : కొత్త ఏసీ కొంటున్నారా? జియోమార్ట్‌లో సగం ధరకే ఏసీలు.. 3 టాప్ బ్రాండ్ల ఏసీలు మీకోసం..!

JioMart Offers : ఏసీల ధరలు తగ్గాయి.. కొత్త ఏసీలను కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే త్వరపడండి. జియోమార్ట్‌లో ఏసీలు చాలా చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు.

JioMart Offers : కొత్త ఏసీ కొంటున్నారా? జియోమార్ట్‌లో సగం ధరకే ఏసీలు.. 3 టాప్ బ్రాండ్ల ఏసీలు మీకోసం..!

Huge Discounts on 3 Best Air Conditioners

Updated On : February 17, 2025 / 5:30 PM IST

JioMart Offers : సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత నుంచి బయటపడేందుకు కొత్త ఏసీలను కొనేందుకు చూస్తుంటారు. మీరు కూడా కొత్త ఏసీ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. తక్కువ ధరలో టాప్ బ్రాండ్ ఏసీలను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ షాపింగ్ దిగ్గజం జియోమార్ట్ సగం ధరకే ఏసీలను విక్రయిస్తోంది. ఫిబ్రవరి నెల సగం గడిచిపోయింది. చలి కూడా బాగా తగ్గిపోయి, మధ్యాహ్నం వేడిగా ఉంటోంది.

కొన్ని రోజుల్లోనే ఎండలు ముదిరేలా కనిపిస్తోంది. అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఎయిర్ కండిషనర్లపై భారీ తగ్గింపులు అందిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అనేక ఏసీల బ్రాండ్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

Read Also : Vivo V50 Launch : వివో ఫోన్ భలే ఉంది భయ్యా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంత? సేల్ ఎప్పటినుంచంటే?

కానీ, జియో ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ కూడా ఏసీలపై భారీ తగ్గింపును అందిస్తోంది. LG, Voltas, Bluestar వంటి ప్రముఖ కంపెనీల ఏసీలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్లు కలిపితే సగం ధరకే ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఏ ఎయిర్ కండిషనర్లపై ఎంత ఆఫర్ ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ :
ఈ ఏసీ ధర రూ. 64,990 అయినప్పటికీ, జియో మార్ట్‌లో 47శాతం తగ్గింపుతో రూ. 33,990కు విక్రయిస్తున్నారు. ఎయిర్ కండిషనర్లపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుతో రూ.2,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

2023లో వచ్చిన ఈ వోల్టాస్ ఏసీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి 3 స్టార్ రేటింగ్ ఉంది. ఏసీ కూలింగ్ ప్రభావాన్ని నాలుగు విధాలుగా అడ్జెస్ట్ చేయవచ్చు. ఇందులో వంద శాతం రాగి కాయిల్ ఉపయోగించారు. ఈ ఏసీలో రెండు రకాల ఉష్ణోగ్రతలను చూపించే డిస్‌ప్లే కూడా ఉంది. ఫంగస్ నుంచి కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ :
ఈ 1.5 టన్ను ఎల్‌జీ ఏసీ ధర రూ.78,990, కానీ జియో మార్ట్ 49శాతం తగ్గింపును అందిస్తోంది. ఆ తర్వాత ఏసీ ధర రూ. 39,990 అయింది. మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుతో షాపింగ్ చేస్తే 10శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

కానీ, ఈ కార్డ్ ఆఫర్ ఫిబ్రవరి 21 వరకు మాత్రమే ఉంటుంది. ఎల్‌జీ ఏసీ 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనే స్పెషల్ టైప్ కంప్రెసర్ ఉంది. ఈ కంప్రెసర్ మీ గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది. తక్కువ శబ్దం వస్తుంది.

Read Also : Money Attract Tips : చాణక్యుడి ఈ 5 సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.. వద్దన్నా వస్తూనే ఉంటుంది.!

బ్లూస్టార్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీ :
మీరు 5 స్టార్ రేటింగ్ కలిగిన ఎయిర్ కండిషనర్ కోసం చూస్తుంటే.. జియోమార్ట్‌లో బ్లూస్టార్ స్ప్లిట్ ఏసీని చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసీ ధర రూ.75,500 ఉంటుంది. 1.5 టన్ను ఏసీ 41శాతం తగ్గింపుతో రూ. 43,990కు లభిస్తుంది. మీరు ఈ ఏసీపై రూ.2,070 నెలవారీ ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు.