Some beliefs : ఈ వస్తువుల్ని చేతికి ఎందుకు ఇవ్వకూడదంటారో మీకు తెలుసా?

కొన్ని వస్తువుల్ని చేతికి ఇవ్వొద్దు అంటారు. కొన్నిటిని చేతితో తాక కూడదు అంటారు. పెద్దవాళ్లు చెప్పే కొన్ని విషయాలు నమ్మకంతో కూడుకున్నవే అయినా నిగూఢంగా కొన్ని మంచి విషయాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.

Some beliefs : పెద్దవాళ్లు కొన్ని పనులు చేయవద్దు అంటూ హెచ్చరిస్తూ ఉంటారు. అవి కేవలం నమ్మకంగా తీసిపారేసినా ఇంట్లో సంతోషం దూరం కాకూడదని కొందరు వాటిని ఆచరిస్తారు. కొన్ని వస్తువులు చేతికి ఇవ్వడం.. కొన్ని చేతితో తాకడం కూడా అశాంతికి, గొడవలకు కారణమవుతుందంటారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

One Day Marriage In China : చైనాలో ఒక్కరోజు ‘వధువు’కు పెరుగుతున్న డిమాండ్ .. ఒక్కరోజు ‘పెళ్లి’వెనుక చైనీయుల వింత నమ్మకం

ఎవరికైనా చేతికి సాల్ట్ ఇవ్వొద్దు అంటారు. ఇది వారి మధ్య గొడవలకు కారణం అవుతుందని చెబుతారు. ఉప్పుని ప్లేట్లో లేదా బౌల్‌లో వేసి ఇమ్మంటారు. మిరపకాయల్ని కూడా చేతికి ఇస్తే వివాదాలకు దారి తీస్తుందని చెబుతారు. తినడానికి ఎవరికైనా ఏదైనా ఫుడ్ ఇస్తున్నప్పుడు దానిని చేతికి ఇవ్వకుండా ప్లేట్‌లో పెట్టి ఇవ్వాలి అంటారు. చేత్తో ఇస్తే ఐశ్వర్యం తగ్గిపోతుందట. చేతి రుమాలు కూడా ఎవరికైనా ఇస్తే అది కూడా సంపదను కోల్పోయేలా చేస్తుందని భావిస్తారు.

Odisha : ఒడిశాలో గిరిజన తెగ వింత ఆచారం.. దుష్టశక్తులు దరిచేరకుండా చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం

డబ్బులు ఎవరికైనా ఇస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు ఎడమ చేత్తో ఇవ్వకూడదు అంటారు. డబ్బును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఎడమచేత్తో అలా చేయకూడదని దాని అర్ధం. పెద్దల ఆశీర్వాదం తీసుకునేటపుడు, దేవుడి విగ్రహాలను తాకినపుడు కూడా కుడిచేతిని ఉపయోగించాలని చెబుతారు. పెద్దవాళ్లు ఏది ఆచరించమని చెప్పినా దాని వెనుక నిగూఢంగా ఏదైనా మంచి విషయం దాగుంటుంది. పరిశుభ్రత, ఆరోగ్యం, క్రమశిక్షణ అలవడటం కోసమే ఇలాంటి నియమాలు పాటించమని చెబుతారు.

ట్రెండింగ్ వార్తలు