World Hypertension Day
World Hypertension Day : హైపర్‌టెన్షన్‌కు కొన్ని ప్రధాన కారణాలలో జీవనశైలి , రోజువారిగా తీసుకునే ఆహారం, వ్యాయామాలు చేయకపోవటం వంటివి చెప్పవచ్చు. అధిక రక్తపోటును సకాలంలో గుర్తించి చికిత్స అందించకుంటే చివరకు గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి దారి తీస్తుంది. హైపర్‌టెన్షన్ పై అవగాహన కల్పించటం ద్వారా పరిస్ధితి తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 17 ను ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
READ ALSO : Hypertension : హైపర్ టెన్షన్ తగ్గించటంలో సహాయపడే ఆహారాలు, పానీయాలు!
వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ అనేది 85 దేశాలకు చెందిన హైపర్‌టెన్షన్ సొసైటీలు, లీగ్‌లతో కలగలిపి ఏర్పాటు చేయబడ్డది. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ 2005లో మే 14న వరల్డ్ హైపర్‌టెన్షన్
డేని ప్రవేశపెట్టారు. అయితే ఇది 2006 నుండి, మే 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డేగా పాటిస్తున్నారు. రక్తపోటు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటం వల్ల పరిస్ధితి తీవ్రంగా మారుతుంది.
దీనిని అరికట్టడమే ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రధాన లక్ష్యం.
READ ALSO : Hypertension : హైపర్ టెన్షన్ ఉంటే ఈ 5 ఆహారాలు తినకపోవటమే మంచిది!
ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రాముఖ్యత: రక్తపోటును ఖచ్చితంగా నిర్ధారించుకోండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అన్న నినాధంతో ఈ ఏడాది ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రజల్లో హైపర్‌టెన్షన్‌పై అవగాహన కల్పించనుంది. హైపర్‌టెన్షన్‌ను క్రమం తప్పకుండా కొలుస్తూ, అదుపులో ఉంచుకోవటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదం తగ్గించుకోవచ్చు. అధిక కొవ్వు పదార్ధాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన ,డిప్రెషన్ వంటివి రక్తపోటుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది.
READ ALSO : డయాబెటిస్ తోనే హైపర్ టెన్షన్…హై బీపీ వల్ల ప్రమాదంలో భారతీయులు
అధిక రక్తపోటు లక్షణాలు ; అధిక రక్తపోటు యొక్క కొన్ని లక్షణాలు తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సత్వరం వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం ఉత్తమని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రక్తపోటు సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజువారి వ్యాయామాలు వల్ల సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.