Leafy Vegetables : వర్షాకాలం ఆకు కూరలు తినడానికి సరైన సమయం కాదట

వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్‌లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leafy Vegetables

Leafy Vegetables : ఆకు కూరల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాంటి ఆకు కూరల్ని వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా తినడం సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు.

ఆరోగ్యానికి ఆకు కూరలు అవసరమే! పోషకాలతో కూడిన వీటిని రోజువారిగా తీసుకుంటే?

వేసవి ఎండల తరువాత వర్షాకాలం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఫ్లూ, ఫుడ్ పాయిజనింగ్, కలరా మొదలైన ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి తగ్గి, ఇన్ ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే మనం తాగే, తినే వాటిలో చాలా జాగ్రత్తలు అవసరం. బయట ఫుడ్ తినడం పరిమితం చేయడంతో పాటు వర్షాకాలంలో ఆకు కూరల్ని కూడా పరిమితంగా తినడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

 

ఆకు కూరలు ఎక్కువగా చిత్తడి ప్రాంతాలలో పండుతాయి. ఇవి బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు, కీటకాలు ఇతర వ్యాధి కారక జీవులు పెరగడానికి అనుకూలమైన పరిస్థితిని కల్పిస్తాయి. ఈ సీజన్‌లో సూర్యరశ్మి లేకపోవడం వల్ల క్రిములు ఆకులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు కంటికి కనిపించవు కాబట్టి ఆకుల నుంచి వాటిని వేరు చేయలేము. ముఖ్యంగా వర్షాకాలంలో మెంతికూర, బచ్చలి కూర, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ తినకూడదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leafy Greens : ఆరోగ్యానికి ఆకు కూరలు అవసరమే! పోషకాలతో కూడిన వీటిని రోజువారిగా తీసుకుంటే?

ఆకు కూరలు తినాలనుకున్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆకు కూరలు కొనుగోలు చేసాక కొద్దిగా రాళ్ల ఉప్పు లేదా వెనిగర్ వేసి కడగాలి. ఇది వాటిపై గూడు కట్టుకుని ఉన్న బ్యాక్టీరియా, కీటకాలను కడగటానికి సహాయపడుతుంది. కూరగాయలతో వంట చేసేటపుడు వాటిని ముందుగా ఉడకబెట్టడం అనేది కొన్ని ఇన్ఫెక్షన్లను నివారించడానికి మార్గం. ఈ సీజన్‌లో రెస్టారెంట్లు, దాబాలలో ఆకు కూరలు తినకుండా ఉండటమే మేలు. ఎందుకంటే వారు వంట చేసేటపుడు వాటిని సరిగా శుభ్రం చేయకపోవచ్చును. ఈ సీజన్‌లో ఆకు కూరలకు దూరంగా ఉండాలనుకుంటే సొరకాయ, బీరకాయ, చేదు పొట్లకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను తినండి. ఇవి కడుపుకు తేలికగా ఉంటాయి.. సుళువుగా జీర్ణం అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు