Leafy Greens : ఆరోగ్యానికి ఆకు కూరలు అవసరమే! పోషకాలతో కూడిన వీటిని రోజువారిగా తీసుకుంటే?

మెంతికూరలో ఇనుము, కాల్షియం, ఎ, సి విటమిన్లు ఉంటాయి. మెంతికూర రక్తం శుద్ధి చేస్తుంది. కళ్ళు, పళ్ళు, కాలేయం, గుండె, మెదడు, ఊపిరితిత్తులలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

Leafy Greens : ఆరోగ్యానికి ఆకు కూరలు అవసరమే! పోషకాలతో కూడిన వీటిని రోజువారిగా తీసుకుంటే?

Leafy Greens :

Leafy Greens : ఆకు కూరలు ఆరోగ్యానికి వరంలాంటివి. వీటిని తీసుకోవడం వలన శరీరంలో ఆరోగ్య పరంగా అనేక అద్భుతాలు కలుగుతాయి. రోజూ ఏదొకరకంగా ఆకుకూరలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండటంతోపాటు శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి మేలు కలిగించే కొన్ని ఆకుకూరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గోంగూర : గోంగూరలో 172మి. గ్రా. కాల్షియం ఉంటుంది. లైసిన్ ఎక్కువగా కలిగిన ఆకుకూర గోంగూర. ఇనుము, కెరోటిన్, నియాసిన్ గోంగూరలో పుష్కలంగా లభిస్తాయి. గోంగూర ఆయాసం, జలుబు, తుమ్ములను తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలకు సంబంధించిన వ్యాధుల నియంత్రణకు గోంగూర ఉపయోగకరంగా ఉంటుంది.

తోటకూర : తోటకూరలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తహీనత నివారణకు మంచిది. గింజతోటకూరలో ఎదుగుదలకు ఉపయోగించే లైసిన్, మిధియోనిన్ వంటి అమైనో ఆమ్లాలు ఉంటాయి. గర్భస్థ శిశువులకు కాల్షియం, ఫోలిక్ యాసిడ్ తగినంతగా లభించాలి అంటే గర్భవతులు తోటకూర తినాలి. తోటకూర పైల్స్ సమస్యను నివారించి, ఎముకలను బలంగా మారుస్తుంది.

బచ్చలికూర : బచ్చలికూర చిగుళ్ళనుండి రక్తస్రావం కావడం, దంతవ్యాధులు, పంటినొప్పిని తగ్గిస్తుంది. గర్భస్థ పిండం చక్కగా ఎదగడానికి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ బచ్చలికూరలో పుష్కలంగా ఉంది. బచ్చలికూర వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మలమూత్రాలు సాఫీగా అయ్యేందుకు, పిల్లల ఎముకల ఎదుగుదలకు ఉపకరిస్తుంది. బచ్చలి కూరలోని లుటెయిన్, జియాక్సాంతిన్ పదార్ధాలు వయస్సుతో వచ్చే కాటరాక్ట్ వంటి కంటి వ్యాధుల నుండి రక్షణనిస్తాయి.

పాలకూర : పాలకూర చిన్న పిల్లల ఎముకల ఎదుగుదలకు, పటిష్టతకు తోడ్పడుతుంది. పాలకూర రక్త హీనత, నరాల బలహీనత పోగొడుతుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. పాలకూరలోని లాక్టిక్ ఆమ్లం బాలింతలలో పాలు పడటానికి తోడ్పడుతుంది. పాలకూర పిండం ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచిది. పాలకూర గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది. పాలకూరలో కాల్షియం, ఇనుము, మాంసకృత్తులు, పీచు, విటమిన్ బి, సి ఉంటాయి.

మెంతికూర : తాజా మెం మెంతికూరలో ఇనుము, కాల్షియం, ఎ, సి విటమిన్లు ఉంటాయి. మెంతికూర రక్తం శుద్ధి చేస్తుంది. కళ్ళు, పళ్ళు, కాలేయం, గుండె, మెదడు, ఊపిరితిత్తులలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మెంతికూరలోని టైగ్రోధిస్ కాలేయం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల నివారణకు చక్కని ఔషధం. మధుమేహ వ్యాధి నివారణకు మెంతులు, మెంతికూర చాలా ఉపయోగకరం. మూత్రకోశ వ్యాధులు, పైల్స్, అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి వాటికి మెంతికూర చాలా ఉపయోగకరం.

చుక్కకూర : చుక్కకూర మధుమేహ నియంత్రణకు మంచిది, మలబద్ధకం పోగొడుతుంది. చుక్కకూర వారానికోసారి తినడం మంచిది. ఎక్కువగా తినకూడదు. చుక్కకూరలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. చుక్కకూర ఆకు చిగుళ్ళ వాపును తగ్గించి నోటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

మునగ ఆకు : మునగ ఆకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మునగ ఆకు మూత్రాశయంలో రాళ్ళను కరిగిస్తుంది. మునగాకు కంటి ఆరోగ్యానికి మంచిది. రేచీకటి ని తగ్గిస్తుంది. మునగాకులో విటమిన్ సి, ఎ, కాల్షియం, భాస్వరం, ఇనుము, థయమిన్, రైబోఫ్లామిన్ వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి.

చింతాకు : చింతకూర శ్వాస నాళానికి సంబధించిన సమస్యలను నయం చేస్తుంది. చింతకూర వాపులు తగ్గిస్తుంది. చింతచిగురు వంటలలో వాడితే పిత్తాశయవాపు తగ్గిస్తుంది.

కొత్తిమీర : కొత్తిమీర బి. పీని కంట్రోల్ చేస్తుంది. ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. కొత్తిమీరలో ప్రోటీన్లు, పిండిపదార్ధాలు, కాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి ఉంటాయి. తలనొప్పి, మూత్రపిండాల వ్యాధులు, కళ్లజబ్బులను తగ్గిస్తుంది. కొత్తిమీర రసం పుక్కిలిస్తే నోటిపూత తగ్గుతుంది.

కరివేపాకు : కరివేపాకు సువాసన, పోషక, ఔషధ విలువలను కలిగి ఉంది. కరివేపాకు లోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. కరివేపాకు మూత్రపిండాల వ్యాధులను తగ్గిస్తుంది. కరివేపాకు శిరోజాల సంరక్షణకు, పటిష్టతకు ఎంతో మేలు చేస్తుంది. కడుపులో నులి పురుగులను హరిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.