Benefits of honey for hair : తేనె రాస్తే జుట్టు తెల్లబడుతుందా? ఇందులో నిజమెంత..

జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుందా? కొన్ని సంవత్సరాలుగా ఈ మాట వింటునే ఉన్నాము. కానీ ఇది నిజమేనా? కేవలం అపోహ మాత్రమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Benefits of honey for hair : జుట్టుకి తేనె రాస్తే తెల్లగా అయిపోతుందని చాలామంది నమ్ముతారు. అలా చేయవద్దని ఇతరులకు సూచిస్తారు. నిజానికి అది ఎవరూ ఎప్పుడూ అనుభవ పూర్వకంగా అయితే చెప్పిన సందర్భాలు ఉండకపోవచ్చు. అయితే ఈ అపోహలు పక్కన పెట్టమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందనే భయాన్ని వదిలేయమంటున్నారు. తేనె కారణంగా ఇంకా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

Honey or Jaggery : తేనె లేదా బెల్లం ఈ రెండింటిలో మధుమేహ రోగులకు ఏది సురక్షితమైనది?

రెగ్యులర్‌గా ఇళ్లలో తేనె వాడుతుంటారు. అయితే జుట్టు విషయానికి వచ్చేసరికి తేనె విషయంలో చాలామంది జాగ్రత్తలు చెబుతారు. తేనె జుట్టుకి రాస్తే తెల్లబడిపోతుందని చెబుతారు. నిజానికి తేనె జుట్టుని తేలికపరుస్తుందట. జుట్టుని సున్నితంగా ఉంచటమే కాకుండా కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుందట. జుట్టు పెరగడానికి సహాయపడటంతో పాటు హెయిర్‌కి మెరుపు ఇస్తుందట. నేచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుందట.

Honey Bee Farming : తేనెటీగల పెంపకంలో స్కేటింగ్ కోచ్.. నెలకు లక్షరూపాయల సంపాదన

తేనెలో నియాసిస్, రిబోఫ్లావిన్, జింక్, ఐరన్ వంటి పోషకాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది జుట్టుని కాంతివంతం చేస్తుందట. తేనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా పెరిగేలా తోడ్పడుతుందట. తేనె జుట్టును తెల్లగా మారుస్తుందని చెప్పే మాటలు కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ఏజెంట్. దాని కారణంగా అతిగా తేనెను జుట్టుకు రాయడం వల్ల కాస్త రంగు తగ్గుతుందని చెబుతున్నారు. అంటే నల్లటి రంగు జుట్టు ఉన్నవారు తేనె ఎక్కువగా రాయడం వల్ల బ్రౌన్ కలర్‌లోకి మారుతుందట. అంతేకానీ.. పూర్తిగా తెలుపురంగులోకి మారడం కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు