Honey or Jaggery : తేనె లేదా బెల్లం ఈ రెండింటిలో మధుమేహ రోగులకు ఏది సురక్షితమైనది?

సాధారణ వ్యక్తులు సైతం చక్కెర కంటే బెల్లం లేదా తేనె తీసుకోవడం మంచిది. డయాబెటిక్ రోగులు చక్కెరకు దూరంగా ఉండాలి. బెల్లం మరియు తేనె గురించి మాట్లాడుకుంటే డయాబెటిక్ రోగులు బెల్లం తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. కానీ సాధారణంగా, అటువంటి వ్యక్తులు బెల్లం వినియోగానికి దూరంగా ఉండటమే బెటర్.

Honey or Jaggery : తేనె లేదా బెల్లం ఈ రెండింటిలో మధుమేహ రోగులకు ఏది సురక్షితమైనది?

diabetic patients

Honey or Jaggery : మధుమేహం అనేది ప్రమాదకరమైన వ్యాధి, మధుమేహం ఉన్నవారు రోజువారిగా తినే ఆహారం, తాగే పానీయాలపై పరిమితులతో జీవించవలసి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జీవనశైలి సక్రమంగా లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం దీనికి ప్రధాన కారణం. మధుమేహం ఉన్నవారి శరీరంలో ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే మధుమేహాన్ని స్లో డెత్ అంటారు. ఇంతకుముందు ఈ వ్యాధి 40-45 ఏళ్ల తర్వాత వచ్చినప్పటికీ, ప్రస్తుతం యువత కూడా దీని బారిన పడుతున్నారు.

READ ALSO : Almonds: బాదములు తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడతాయా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. దీనితో పాటు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలని. తీపి పదార్థాలను పూర్తిగా నివారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తీపి పదార్థాలు డయాబెటిక్ రోగులకు విషం లాంటివి. ఇవి హాని కలిగిస్తాయి.

ఇవి ఆరోగ్యకరమైన చక్కెర ప్రత్యామ్నాయాలు:

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటున కూడా చక్కెరను ఉపయోగించకూడదు. ఇది షుగర్ లెవల్స్ ను వెంటనే పెంచుతుంది. చక్కెర కు ప్రత్యామ్నాయాలుగా బెల్లం మరియు తేనె ఉత్తమ ఎంపికలు. ఈ రెండూ ఆహారానికి తీపిని తెస్తాయి. ఇది శరీరానికి హాని కలిగించదు. చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం లేదు.

READ ALSO : షుగర్ వ్యాధి ముప్పు పొంచి ఉందా.. అయితే, జాగ్రత్త!

బెల్లం మరియు తేనె యొక్క ప్రయోజనాలు:

యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తేనెలో ఉన్నాయి. తేనెను ఉపయోగించడం ద్వారా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే, ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మధుమేహం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. బెల్లం గురించి చెప్పాలంటే, పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్లు B1, B6 మరియు C పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు మంచిది.

బెల్లం లేదా తేనె ఏది ప్రయోజనకరం?

సాధారణ వ్యక్తులు సైతం చక్కెర కంటే బెల్లం లేదా తేనె తీసుకోవడం మంచిది. డయాబెటిక్ రోగులు చక్కెరకు దూరంగా ఉండాలి. బెల్లం మరియు తేనె గురించి మాట్లాడుకుంటే డయాబెటిక్ రోగులు బెల్లం తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. కానీ సాధారణంగా, అటువంటి వ్యక్తులు బెల్లం వినియోగానికి దూరంగా ఉండటమే బెటర్. ఎందుకంటే చక్కెర , బెల్లం తయారీకి మూలం ఒకటే. చెరకు నుండి పంచదార , బెల్లం రెండూ లభిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

READ ALSO : Heart Disease : షుగర్ ఉన్నవారికి గుండె జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే ?

మరోవైపు, బెల్లం బదులుగా తేనె తీసుకోవడం మధుమేహ రోగికి చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సహజంగా తయారవుతుంది. అంతేకాకుండా సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను
సంప్రదించి తగిన సూచనలు , సలహాలు పొందటం మంచిది. వ్యాసంలో