Face Packs : చర్మానికి న్యాచురల్ గ్లో కోసం ఫేస్ ప్యాక్స్!.

ఒక స్పూను తేనెలో ఆల్మండ్ అయిల్ కొన్ని చుక్కలు వేసి ముఖం, మెడబాగాల్లో రాసుకోవాలి. 15నిమిషాల వరకు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి.

Face Packs

Face Packs : చర్మం ఆరోగ్యంగా, కోమలంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్ వాడుతుండాలి. ఇలాచేయటం వల్ల రక్తప్రసరణ చురుగ్గాసాగుతుంది. ఇది చర్మానికి ఒక టానిక్ గా ఉపకరిస్తుంది. వారంలో ఒకటి రెండు సార్లు ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే చర్మం అందంగా మారుతుంది. మామూలుగా మార్కెట్లో ఫేస్ ప్యాక్ లు రెడీగా దొరుకుతాయి. అయితే ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. అయితే చర్మ తత్వాన్ని బట్టీ మీరు ఫేస్ ప్యాక్ లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

పొడి చర్మం కోసం ఫేస్ ప్యాక్స్ ;

ఒక స్పూన్ గంధం పొడి, ఒక స్పూను తేనె, ఒక స్పూను పాలపొడి, ఒక స్పూను గులాబీ వాటర్ కలిపి పేస్టుగా చేసుకోవాలి. దీనిని ముఖం, మెడ బాగాల్లో రాసుకుని అరగంటపాటు ఆర నివ్వాలి. అనంతరం చల్లని నీటితో కడిగేయాలి.

ఒక స్పూను బాదం నూనె, ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను మీగడ కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖం, మెడబాగాల్లో అప్లై చేయాలి. అరగంట వరకు ఆరనిచ్చి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.

రెండు చుక్కల ఆలివ్ అయిల్ , 2 స్పూన్ల మైదాపిండిలో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దానిని ముఖంపై ప్యాక్ గా వేసుకోవాలి. అరగంటపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

సాధారణ చర్మం కోసం ఫేస్ ప్యాక్స్ ;

రెండు బాదం గింజలను నానబెట్టి మెత్తగా చేసుకోవాలి. దానిలో రెండు స్పూన్ల పాలు, ఒక స్పూను క్యారెట్ గుజ్జు, ఒక స్పూను ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, మెడబాగాల్లో అప్లై చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం కోమలంగా మారుతుంది.

ఒక స్పూను తేనెలో ఆల్మండ్ అయిల్ కొన్ని చుక్కలు వేసి ముఖం, మెడబాగాల్లో రాసుకోవాలి. 15నిమిషాల వరకు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి.

2స్పూన్ల గోధుమ పిండిలో పాలు, పసుపు కలుపుకోవాలి. అందులోనే కొంచెం రోజ్ వాటర్ వేసి ముఖం, మెడభాగాల్లో పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

కొంచెం గోధుమ పిండిలో నీళ్ళు, ఒక స్పూను తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి పట్టించాలి. అరగంటపాటు అంతే ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఆయిలీ చర్మం కోసం ఫేస్ ప్యాక్స్ ;

ఒకటిన్నర స్పూను ముల్తానీ మట్టిలో ఒకటిన్నర స్పూను నిమ్మరసం, అర స్పూను తేనె కలుపుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. అరగంటపాటు అలాగే ఉంచి చల్లని నీటితో కడుక్కోవాలి.

కందిపప్పు, బియ్యంను మెత్తగా గ్రైండ్ చేసి అందులో గంధం పొడి, ముల్తానీ మట్టి, ఆరంజి తొక్కల పొడి, 2స్పూన్ల కీరా రసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంటపాటు అలాగే వదిలేయాలి. తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.

కొంచెం బార్లీ పిండి, 2స్పూన్ల నిమ్మరసం, కొన్ని పాలు కలపి పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. అరగంటపాటు అంతే వదిలేయాలి. అనంతరం చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.