dogs bite
dogs bite : పులిని చూస్తే భయపడను గానీ కుక్కను చూస్తే మాత్రం భయంరా బాబు అంటారు కొంతమంది. ఎందుకంటే పులి అడవిలో ఉంటుంది. జూలో ఉంటుంది. కానీ కుక్కలు ప్రతీ వీధుల్లోను ఉంటాయి. కుక్క కాట్లకు బలి అంటూ ఎన్నో వార్తలు వింటుంటాం. వీధి కుక్కల్ని చూస్తే హడలిపోయే పరిస్థితి. ఎక్కడ మీద పడి కరిచేస్తాయోనని. కానీ మనకు కనిపించిన ప్రతీ కుక్కా కరవదు. వాటి వాటి భావోద్వేగాలను బట్టి ఒక్కోసారి మనుషుల మీద దాడి చేస్తుంటాయి. కానీ ఏ కుక్క కరుస్తుందో మనకు తెలియదు. దీంతో వీధిలో కుక్క కనిపిస్తే చాలు భయపడిపోతుంటాం.
కానీ ఏ కుక్క కరుస్తుంది..? ఏ కుక్క కరవదు అనేది కూడా తెలుసుకోవాలి. కుక్క ఉన్న పొజిషన్ ను బట్టి అది మనమీద దాడి చేస్తుందో లేదో తెలుసుకోవచ్చట. కొన్ని కుక్కలు మనుషులను చూస్తే మొరుగుతాయి. దీంతో భయపడిపోతాం. కానీ మొరిగే కుక్క కరవదు అంటారు పెద్దలు. ఇది కూడా నిజమేనట. మొరిగే కుక్క కరుస్తుందని గ్యారంటీ లేదు.అలాగే మొరకని కుక్క కరవదని చెప్పలేం. కానీ కుక్క ఉన్న పొజిషన్ ను బట్టి అది కరుస్తుందో లేదో తెలుసుకోవచ్చట. అలా తెలుసుకుంటే కుక్క కాట్ల నుంచి తప్పించుకోవచ్చు కదా..
సాధారణంగా కొన్ని కుక్కలు మాంచి దూకుడుమీదుంటాయి. మనుషుల దగ్గరకు వచ్చేస్తాయి. బాబోయ్ కరిచేస్తుందేమోఅని భయపడిపోతాం. కొన్ని కుక్కలు అరుస్తాయి. వాటిని చూస్తే ఆటోమేటిక్ గా భయపడిపోతాం. కుక్కలకు కరిచేందుకు వేరే కారణాలు ఉంటాయట.. ఉదాహరణకు ఓ కుక్క సంతోషంగా ఉందనుకోండి అది కరవదని తెలుసుకోవాలి. మరి ఆ కుక్క సంతోషంగా ఉందని ఎలా తెలుస్తుంది అంటే..సంతోషంగా ఉన్న కుక్క శరీరాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే దాని బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుసుకోవచ్చు.. సంతోషంగా ఉన్న కుక్క శరీరం మొత్తాన్ని కదిలిస్తుంటుంది. తోక ఊపుతుంటుంది. కాలు ఎత్తి రకరకాల విన్యాసాలు చేస్తుంది.
కానీ ఓ కుక్క కదలకుండా తీక్షణంగా చూస్తుంటే అది మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకోవాలి. అది కరిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుక్క శరీరంపై వెంట్రుకలు (బొచ్చు) నిలబొడుకుని ఉంటే అది కరుస్తుందని తెలుసుకోవాలి. అదే పెంపుడు కుక్క అయినా సరే అటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు దానిని ముద్దు చేయకపోవటమే మంచిది. మీద చేయి వేసి నిమిరినా అవిFood in News papers : న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహారం తింటున్నారా..? ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక ఇరిటేట్ అయి కరిచే అవకాశాలుంటాయి.
కుక్కలకు కోపం వస్తే వాటి కళ్ళు పూర్తిగా మారిపోతాయి. కళ్లలో తెల్లసొన ఎక్కువగా కనబడుతుంది. అటువంటి సమయంలో అది కచ్చితంగా కరిచే పరిస్థితిలో ఉందని తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా కుక్కలను చూసి మనం భయపడినా..రాళ్లు వేసి వాటిని ఇరిటేట్ చేసినా కరిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అలాగే నిద్రపోతున్న కుక్కల్ని ఏమాత్రం లేపొద్దు. ఆ సమయంలో అవి పుల్ రిలాక్స్ మోడ్ లో ఉంటాయి. వాటిని ఇబ్బంది పెడితే ఉలిక్కిపడి లేస్తాయి. ఆ సమయంలో అవి కరిచే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అవి కరిచే మూడ్ లో లేకపోయినా వాటి ఏకాంతానికి భంగం కలిగిస్తే ఇరిటేట్ అయి కరుస్తాయి. అది భయంతో కావచ్చు..ఇరిటేషన్ తో కావచ్చు.
కుక్కలకు ఆహారం పెట్టేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి అవి కరిచే అవకాశాలు కూడా ఉంటాయట. అలాగే వీధిలో కుక్కలు కనిపించగానే భయపడకూడదు. భయపడితే మరి రెచ్చిపోతాయి. సాధారణంగా మనం గమనించంగానీ కుక్కలు మన ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ను గమనిస్తాయి. మనం భయపడినట్లుగాను..బెదిరినట్లుగాను ఉంటే గమనించి దాడి చేసేందుకు రెడీ అవుతాయి.
Delhi : కుక్కతో కలిసి వాకింగ్ చేసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా ఐఏఎస్
అలాగే కుక్కలు దెబ్బలాడుకునే సమయంలో వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు. అవి రోడ్ల పక్కల ఆహారం తినే సమయంలో కూడా వాటికి ఇబ్బంది కలిగించొద్దు. అలాగే ప్రశాంతగా పడుకున్న కుక్కమీద రాళ్లు వేసి కొడితే కరుస్తాయి. వీధిలో కుక్కల్ని చూసి అతిగా భయపడొద్దు. తడబాటుగా నడవకూడదు. మామూలుగా నడుచుకుంటు ముందుకెళ్లిపోవాలి. లేదంటే వాటిని అనుమానం వస్తుంది.
అలాగే వీధిలో ఉండే కుక్కల్ని చూసి ఓ కర్రో లేదో ఏదైనా పట్టికెళితే కొన్ని సార్లు అవి భయపడొచ్చు. కానీ తమమీద దాడి చేస్తారనే భయంతో కరిచేందుకు వెనుకాడవు. ఎందుకంటే సెల్ఫ్ ప్రొటక్షన్ కోసం కరుస్తాయి. కాబట్టి కుక్కలు ఉండే పొజిషన్ ను బట్టి..అవి కరుస్తాయా..? కరవవా అనేది అర్థం చేసుకుంటే కుక్క కాట్ల నుంచి తప్పించుకోవచ్చు.