Facts about Height : మీరు రాత్రి కంటే ఉదయం పొడవుగా ఉంటారు.. కావాలంటే కొలుచుకోండి..

రాత్రిపూట మనం ఉన్న పొడవుకి .. మేల్కొన్న వెంటనే చూసుకునే హైట్‌కి తేడా ఉంటుందట. కారణం ఏంటి?

Facts about Height

Facts about Height : కొందరు హైట్ తక్కువగా ఉంటే బాధపడతారు. కొంతమంది హైట్ మరీ ఎక్కువగా ఉన్నామని ఫీలవుతారు. ఇదంతా పక్కకి పెడితే రాత్రికి, ఉదయానికి మీ హైట్‌లో తేడా ఉంటుందని మీకు తెలుసా?

Short people live longer : పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారట

చాలామంది పొడవు పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఓ వయసుకి వచ్చాక ఓ హైట్‌కి మన బాడీ ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత పెరగడం కష్టం. అయితే నార్మల్‌గా మన పొడవు ఇంత అని ఫిక్స్ అయిపోతాం. అయితే ఉదయం లేవగానే మనం ఉండే పొడవుకి.. రాత్రి వేళ మనం ఉండే పొడవుకి వ్యత్యాసం ఉంటుందట. అదెలా అంటే?

వెన్నెముకలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లలో మార్పుల కారణంగా ఎత్తులో తేడా ఉంటుందట. డిస్క్‌లు ప్రధానంగా నీటితో ఉంటాయి. ఈ ద్రవంలో వచ్చే మార్పులే డిస్క్‌ల ఎత్తును నిర్దేశిస్తాయి. పగటిపూట కూర్చుంటాం.. నిలబడతాం.. వంగుతాం.. ఇలా కదలికల వల్ల డిస్క్‌లు గణనీయమైన మొత్తంలో లోడ్ అయి ఉంటాయి. ఫలితంగా డిస్క్ ‌లలో ద్రవాన్ని బయటకు పంపుతాయి. అందువల్ల ఎత్తు తక్కువగా ఉంటుంది. నిద్రలో వెన్నెముక ఎటువంటి లోడింగ్‌తో ఉండదు. అందువల్ల పొడవు పెరుగుతుందట. అలా రాత్రి కంటే ఉదయం 1 సెంటీమీటరు పొడవు ఎక్కువగా ఉంటారట.

Finger length tells the personality : ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉందా? అయితే మీరు దమ్మున్న లీడర్ అన్నమాట

సాధారణంగా ఆడపిల్లలు చాలా ఫాస్ట్‌గా ఎదుగుతారు. 14 నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి మంచి హైట్‌లో ఉంటారు. అబ్బాయిలు 16 సంవత్సరాల వయసు వచ్చేవరకు పొడవు పెరుగుతారు. వారిలో కండరాలు యుక్త వయసు వచ్చినా పెరిగే ఛాన్స్ ఉంటుందట.