మెట్లెక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సాధారణంగా ఎక్కడికయినా వెళ్తే మెట్ల మార్గం ఎంచుకోవడం కన్నా ముందు లిఫ్ట్ ఉందా లేదా అని ఆలోచిస్తాం. కానీ అలా చేయకండి.. కుదిరినప్పుడల్లా కచ్చితంగా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించండి. దానివల్ల మీ ఆరోగ్యానికి, అందానికి చాలా లాభాలు ఉన్నాయి. మెట్లెక్కడం వల్ల గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. రెండువేల మంది యువతుల పై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోజులో కాసేపయినా మెట్లెక్కే వారిలో గుండెకు మేలు జరుగుతుందని తేలింది.
అంతేకాదు అలా చేయడం ద్వారా బరువు కూడా సులువుగా తగ్గుతారు. మెట్లెక్కడం వల్ల ఎముకలూ, కండరాలకూ మంచిది. అయితే నెమ్మదిగా కాకుండా.. కాస్త వేగంగా ఎక్కేలా చూసుకోవడం మంచిది. మోకాళ్లకు కూడా మంచి వ్యాయామం అందించినవారవుతారు. దాంతో పాటు స్లిమ్ గా మారి అందంగా తయారవుతారు కూడా. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.
చదువుకునే వారికి వ్యాయామం చేసే తీరిక ఉండదు కాబట్టి.. సన్నబడాలనే తాపత్రయంతో పొట్ట మాడ్చుకోవాల్సిన అవసరంలేదు. రోజుకు 10 నిమిషాలు మెట్లు ఎక్కి దిగితే సరిసోతుంది. నడక, జాగింగ్ తో పోలిస్తే… దీనివల్ల ఎక్కువ కెలొరీలు కరుగుతాయి. ఈ వ్యాయామం చేశాక అలసట, బద్దకం లాంటివి దూరమై… చురుగ్గా ఉంటారు.