Heart Diseases Risk : గుండె జబ్బులు ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ వాస్తవాలు..!

అసలే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. వ్యాయామానికి కూడా సమయంలేని పరిస్థితి.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

Heart Diseases : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. వ్యాయామానికి కూడా సమయంలేని పరిస్థితి.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రతి ఒక్కరి ఆధునిక జీవితంలో శారీరక శ్రమను భాగంగా చేసుకోవాలని అధ్యయన నిపుణులు సూచిస్తున్నారు. సైకిల్ తొక్కడంతో పాటు వాకింగ్ చేయడం చేస్తుండాలి. స్థూలకాయాన్ని తరిమికొట్టాలి. లేదంటే గుండెజబ్బులకు కారణమవుతుంది. పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్, బర్గర్లతో బర్గర్లు, పిజ్జాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా ఉండే కూరగాయలు, కార్భోహైడ్రేట్లు రైస్, పస్తా, బ్రెడ్ తినాలని సూచిస్తున్నారు.

పొగతాగే అలవాటు ఉండే వెంటనే మానేయాలి. లేదంటే ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. యోగ చేయడం ద్వారా రక్తపోటును అదుపులోకి ఉంచుకోవచ్చు. కొలెస్టరాల్ స్థాయిలు తగ్గించుకోవాలి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఆందోళన, ఒత్తిడులను తగ్గించుకోవాలి. గుండె రక్తనాళాల వ్యాధులు అధికంగా పురుషుల్లో వస్తాయి. అలాగే మెనోపాజ్‌ దశలో స్త్రీలలోనూ వస్తుంటాయి. స్మోకింగ్ అలవాటు ఉన్నవారలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. పొగతాగడం ద్వారా అందులో నికోటిన్‌, రక్తనాళాలను చంపేస్తుంది.

రక్తనాళాలలోని రక్తాన్నిగడ్డకట్టేలా చేస్తుంది. శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో ఈ  అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక స్థాయిలో చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు, కొవ్వు పదార్ధాలు హృదయ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణమవుతాయి.

Read Also : Lamborghini : కరోనా టైమ్‌లోనూ తగ్గేదేలే.. లంబోర్గిని అమ్మకాల్లో సరికొత్త రికార్డు.. ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు

ట్రెండింగ్ వార్తలు