Lamborghini : కరోనా టైమ్‌లోనూ తగ్గేదేలే.. లంబోర్గిని అమ్మకాల్లో సరికొత్త రికార్డు.. ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు

లగ్జరీ స్పోర్ట్స్ కారు సంస్థ లంబోర్గిని.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. కరోనా సంక్షోభం సమయంలోనూ విక్రయాల్లో టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. ఈ క్రమంలో 59ఏళ్ల రికార్డులను

Lamborghini : కరోనా టైమ్‌లోనూ తగ్గేదేలే.. లంబోర్గిని అమ్మకాల్లో సరికొత్త రికార్డు.. ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు

Lamborghini

Lamborghini : లగ్జరీ స్పోర్ట్స్ కారు సంస్థ లంబోర్గిని.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. కరోనా సంక్షోభం సమయంలోనూ విక్రయాల్లో టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. ఈ క్రమంలో 59ఏళ్ల రికార్డులను తిరగరాసింది.

ఇటాలియన్‌ కార్‌ బ్రాండ్ లంబోర్గినికి.. సూపర్‌ స్పోర్ట్స్‌ కార్‌ కేటగిరిలో వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. లంబోర్గిని కార్లకు అన్ని దేశాల్లో స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. రెండేళ్లుగా కరోనాతో తగ్గిన లంబోర్గిని అమ్మకాలు.. 2021లో పుంజుకున్నాయి. అమ్మకాలు ఏకంగా 59ఏళ్ల రికార్డులను తిరగ రాశాయి.

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

లంబోర్గిని బ్రాండ్‌కి సంబంధించి 2021లో ప్రపంచ వ్యాప్తంగా 8వేల 405 కార్లు అమ్ముడయ్యాయి. కంపెనీ హిస్టరీలో ఇదే అత్యధికం. లంబోర్గిని బ్రాండ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి అమ్మకాలు జరిగాయి.

Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవా?

బాగా సేల్ అయిన వాటిలో లంబోర్గిని ఉరుస్‌ మోడల్‌ కారు అత్యధికంగా అమ్ముడుపోయింది. ఉరుస్‌ మోడల్‌ కార్లే 5వేల 021 అమ్ముడయ్యాయి. ఇండియాలో ఉరుస్‌ కారు ఎక్స్‌ షోరూమ్ ధర కనిష్టంగా రూ.3.15 కోట్ల నుంచి రూ.3.43 కోట్ల వరకు ఉంది. ఉరుస్‌ తర్వాత స్థానంలో హురాకాన్‌ మోడల్‌ నిలిచింది. రూ.3.21 కోట్ల నుంచి రూ.4.99 కోట్ల రేంజ్‌లో లభించే హురుకాన్‌ మోడల్‌ కార్లు 2వేల 586 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అవెంటడార్ మోడల్ నిలిచింది.