Black Neck : నల్లగా మారిన మెడను క్లీన్ చేసుకునే హోం రెమెడీస్ !

నిమ్మరసాన్ని మెడపై రాసుకుంటే మెడ నలుపు తగ్గుతుంది. దీని కోసం, ఒక నిమ్మకాయను బాగా పిండండి. దాని రసాన్ని తీసి, ఆపై దానికి రోజ్ వాటర్ జోడించాలి. దీన్ని మెడకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీళ్లతో కడిగేయాలి.

Black Neck : నల్లగా మారిన మెడను క్లీన్ చేసుకునే హోం రెమెడీస్ !

Dark Neck

Updated On : June 5, 2023 / 2:36 PM IST

Black Neck : సూర్యకాంతి, అధిక చెమట కారణంగా శరీరంలోని హార్మోన్లు అసమతుల్యతతో, మెడ చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖం అందంగా ఉన్నప్పటికీ మెడ ప్రాంతం నల్లగా ఉండటంతోపా ఆ అందాన్ని కనుమరుగు చేస్తుంది. సూర్యరశ్మి, కాలుష్యం వల్ల ముఖం నిర్జీవంగా మారి మెడ రంగు కూడా నల్లగా మారిపోతుంది. కొన్నిసార్లు మెడపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అవి అంత సులభంగా పోవు. కాబట్టి ఒక్కోసారి హైపర్పిగ్మెంటేషన్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. హార్మోన్ల మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు.

READ ALSO : Turmeric For Skin Care : వేసవిలో కూడా మీ చర్మం మెరవాలంటే చర్మ సంరక్షణలో దీనిని చేర్చుకోండి ?

అటువంటి సందర్భాలలో, హైపర్పిగ్మెంటేషన్ను తగ్గించడానికి వైద్యుడిని సంప్రదించాలి. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. దీని నివారణకు సాధారణ ఇంటి నివారణలు బాగా ఉపకరిస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శనగపిండి మరియు నిమ్మ ;

ఒక చెంచా శెనగపిండిలో ఒక చెంచా నిమ్మరసం, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత మెడపై అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తరువాత, తేలికగా చేతి వేళ్ళతో మసాజ్ చేయాలి. తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రంగా, మెరిసిపోతుంది.

READ ALSO : Dry Skin : చలికాలంలో బాధించే పొడి చర్మం సమస్యను సహజ చిట్కాలతో తొలగించుకోండి!

నిమ్మకాయ మరియు రోజ్ వాటర్ ;

నిమ్మరసాన్ని మెడపై రాసుకుంటే మెడ నలుపు తగ్గుతుంది. దీని కోసం, ఒక నిమ్మకాయను బాగా పిండండి. దాని రసాన్ని తీసి, ఆపై దానికి రోజ్ వాటర్ జోడించాలి. దీన్ని మెడకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీళ్లతో కడిగేయాలి.

పచ్చి పాలు ;

పచ్చి పాలు చర్మాన్ని శుభ్రపరచడంలో బాగా సహాయపడుతాయి. దీని కోసం, ఒక గిన్నెలో కొన్ని పచ్చి పాలు తీసుకుని, అందులో కాటన్ క్లాత్ ను ముంచి మెడబాగాన్ని తుడవాలి. అలాగే 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటితో కడగాలి.

READ ALSO : Red Curry Dal : ఎర్ర కందిపప్పుతో అందానికి మెరుగులు! ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది

దోసకాయ మరియు రోజ్ వాటర్ ;

ముందుగా దోసకాయను సన్నగా తరిగి అందులో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని తర్వాత మెడబాగంలో అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత నీటితో కడగాలి.

బంగాళదుంప రసం ;

బంగాళాదుంపలో విటమిన్-సి ఉంటుంది, ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా బంగాళాదుంప తురుము చేసి దాని రసాన్ని తీసి మెడకు పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

READ ALSO : Look Beautiful : ముఖ చర్మం అందంగా, తెల్లగా కనిపించాలంటే !

కలబంద ;

కలబందలో యాంటీఆక్సిడెంట్లు మరియు కొన్ని ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి చర్మంపై పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి పని చేస్తాయి. మెడపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడానికి, ముందుగా కలబంద ఆకు యొక్క రసాన్ని తీసి మెడకు అప్లై చేయాలి. మెడను 10 నిమిషాలు చేతులతో మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడగాలి.