Red Curry Dal : ఎర్ర కందిపప్పుతో అందానికి మెరుగులు! ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది

సహజమైన స్క్రబ్‌గా కూడా పనిచేస్తుంది మరియు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది మరియు చర్మాన్ని లోతుగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఎర్ర పప్పులో ఉండే పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి.

Red Curry Dal : ఎర్ర కందిపప్పుతో అందానికి మెరుగులు! ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది

Red Curry Dal

Red Curry Dal : ఎర్ర కందిపప్పు పోషకాల నిలయంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి రుచిని కలిగి ఉంటాయి. చాలా మంది ఈ కందిపప్పును కూరగా చేసుకొని ఇష్టంగా తింటారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు ఎర్ర పప్పులో 40 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 15 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఎర్ర కందిపప్పును ఆహారంలో చేర్చుకోవటం వల్ల ొక రోజుకు కావాల్సిన పోషకాలన్నీ శరీరానికి అందినట్లేనని చెప్పవచ్చు.

ఇక ఆ విషయం పక్కన పెడితే ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి ఎర్ర కందిపప్పు ఉపయోగపడతాయి. చర్మాన్ని మృదువుగా మార్చటంతోపాటు, కాంతి వంతంగా మారుస్తాయి. చర్మ సంరక్షణ సామర్థ్యాన్ని ఎర్ర కందిపప్పు కలిగి ఉన్నట్లు సౌందర్య నిపుణులు చెబుతున్నారు. టాన్ క్లియర్ చేయడం మొదలు, రంధ్రాలను బిగుతుగా మార్చడం వరకు, ఇది చర్మానికి మెరుపును మరియు పోషణను కూడా ఇస్తుంది.

సహజమైన స్క్రబ్‌గా కూడా పనిచేస్తుంది మరియు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది మరియు చర్మాన్ని లోతుగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఎర్ర పప్పులో ఉండే పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. రెడ్ లెంటిల్ ఫేస్ ప్యాక్‌లు డార్క్ స్పాట్స్ మరియు మొటిమల మచ్చలను సమర్థవంతంగా పోగొట్టడంలో సహాయపడతుంది. ఎర్ర కందిపప్పు పొడితో తయారు చేసిన ఫేస్ మాస్క్ లతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.

ఎర్ర కందిపప్పుతో ఫేస్ మాస్క్ ;

1. చర్మం బిగుతుగా మారడానికి ఎర్ర కందిపప్పు, ఎగ్ వైట్ , మిల్క్ ఫేస్ ప్యాక్:

ఎర్రకందిపప్పు పొడిని పాలు, గుడ్డు తెల్లసొనతో కలుపుకోవాలి. పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి. సుమారు 10 నిమిషాల తర్వాత, చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. ముఖానికి సహజమైన కాంతిని అందిస్తుంది.

2. చర్మం కాంతివంతంగా మారటానికి ఎర్రకందిపప్పు, ఆరెంజ్ తొక్కలతో ఫేస్ ప్యాక్ ;

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఆరెంజ్ పండును తీసుకుని దానిని ఉండే తొక్కను వేరు చేయాలి. ఆ తర్వాత మిక్సీలో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్‌ టేబుల్ స్పూన్ తేనె, రెండు నుంచి మూడు ఫ్రెష్ ఆరెంజ్ తొక్కలు, అరకప్పు బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖం వాష్ చేసుకోవాలి.

3. ఎర్రకందిపప్పు, ఆల్మండ్ ఆయిల్ యాంటీ యాక్నే ఫేస్ ప్యాక్:

ఒక టేబుల్ స్పూన్ మసూర్ పప్పు పొడిని 1 టీస్పూన్ బాదం నూనె, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, ఆరిపోయే వరకు వదిలివేయాలి. తరువాత చల్లటి నీటితో మెల్లగా కడగాలి. మొటిమల నివారణకు వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.