Kims Cuddles Doctors : విమానంలోనే అత్యాధునిక వైద్యం.. అరుదైన మెదడు సమస్యతో బాలుడు.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
Kims Cuddles Doctors : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి బాబును తీసుకొచ్చి చికిత్స అందించారు.

How Kims Cuddles doctors saved the life of an 12-Yr-old Boy mid-air on flight
Kims Cuddles Doctors : ఆ బాలుడికి అరుదైన ఇన్ఫెక్షన్.. దానికితోడు తీవ్ర జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా. చివరికి సొంత తల్లిదండ్రులను కూడా ఆ బాబు గుర్తుపట్టలేని పరిస్థితి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని ముందుగా స్థానికంగానే ఆస్పత్రిలో చేర్చారు. కానీ, అతడి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!
కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి బాబును తీసుకొచ్చి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్ పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే పేర్కొన్నారు.
“ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది. ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం.
విమానంలో తీసుకొచ్చేందుకు పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు 9 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది. ఫిట్స్ వచ్చాయి. తగిన మందులతో నయం చేశారు. రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా అరుదు. అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా మందులతో నయం చేశారు.
9వ రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం. ఎయిర్ అంబులెన్స్ కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి క్యూర్ చేశాం. నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రిదే” అని డాక్టర్ పరాగ్ డెకాటే పేర్కొన్నారు.
Read Also : iQOO Z9s First Sale : ఈ నెల 29 నుంచే ఐక్యూ జెడ్9ఎస్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!