Salt Consumption
Salt Consumption : ఉప్పు తినడం ఆరోగ్యమే. రుచికి చాలా బాగుంటుంది. కానీ, అధికంగా ఉప్పును తీసుకుంటే అది మీ ఆహార రుచిని పాడు చేస్తుంది. అధిక ఉప్పు ఆరోగ్య మానసిక స్థితిని కూడా కీడు చేస్తుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.
ఏదైనా ఆహారంలో ఉప్పు లేకుండా తినడం కష్టమే. లేదంటే ఆహార పదార్థాలు చప్పగా ఉంటాయి. అందుకే చాలామంది టేస్ట్ కోసం ఉప్పును తెగ వాడేస్తుంటారు. ఉప్పు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది.
Read Also : Vivo T4x 5G Launch : వారెవ్వా.. వివో T4x 5జీ ఫోన్ కిర్రాక్.. ఈ నెల 5నే లాంచ్ అంట.. ధర, ఫీచర్లు కెవ్వు కేక..!
కానీ, పరిమతికి మించి ఏది వాడినా అది నష్టమే అనేది గుర్తించాలి. సరైన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు సరైన పరిమాణంలో ఉప్పు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒక రోజులో ఎంత ఉప్పు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిమితికి మించి ఉప్పు వాడితే :
ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరం అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఉప్పు,చక్కెర పరిమాణానికి సంబంధించి అనేకసార్లు మార్గదర్శకాలను జారీ చేసింది.
దీని ప్రకారం.. ప్రపంచంలో చాలా మంది అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉప్పును తీసుకుంటున్నారు. రోజుకు 9 గ్రాముల నుంచి 12 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి.
రోజుకు గరిష్టంగా 5 గ్రాములు :
రసాయనికంగా సోడియం క్లోరైడ్ (NaCl) అని పిలుస్తారు. ఉప్పు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంటే.. దాదాపు 1 టీస్పూన్. 5 గ్రాముల ఉప్పులో 2వేల మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఒక గుండె జబ్బు కలిగిన వ్యక్తి రోజుకు 1500 మిల్లీగ్రాముల కన్నా తక్కువ సోడియం తీసుకోవాలి.
ఉప్పు ఎక్కువగా తింటే కలిగే దుష్ప్రభావాలు :
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటే అది మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా కిడ్నీలు ఫిల్టర్ సామర్థ్యాన్ని కోల్పోయి చివరికి పాడైపోయే ప్రమాదం ఉంది.
ఉప్పు తక్కువగా వాడితే కలిగే నష్టాలు :
మీరు అవసరమైన దానికంటే తక్కువ ఉప్పు తీసుకుంటే.. అది తలనొప్పి, అలసట, బలహీనత, వాంతులు, తలతిరుగుటకు దారితీస్తుంది. మీరు రోజూ తీసుకునే ఉప్పు కొద్ది పరిమాణంలో మాత్రమే ఉండాలి.
ఏ ఉప్పు మంచిదంటే? :
ఆహారంలో టేబుల్ సాల్ట్ లేదా అయోడైజ్డ్ సాల్ట్ వాడేవారు గాయిటర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. రాతి ఉప్పులో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి నల్ల ఉప్పు మంచిదని భావిస్తారు. పింక్ సాల్ట్‌లో కూడా ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. మీరు ఏదైనా ఉప్పు లేదా ఉప్పును వివిధ రకాలుగా తీసుకోవచ్చు. కానీ, ఎల్లప్పుడూ ఉప్పు తీసుకునే పరిమాణాన్ని గుర్తుంచుకోండి.
ఉప్పు ఎందులో ఎక్కువంటే? :
ఉప్పు మాత్రమే కాదు.. చాలా ఆహార పదార్థాల్లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్యాక్ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అసలు తినొద్దు. ఈ రకమైన ఆహారంలో అధిక సోడియం ఉంటుంది. తద్వారా ఉప్పు తినకుండానే మీ శరీరంలో సోడియం ఎక్కువగా చేరుతుంది.
మీరు ఉప్పును సరైన మోతాదులో తీసుకోవాలంటే ప్రాసెస్ చేసిన ఆహారం, పిజ్జా, బర్గర్లు, ప్యాక్ చేసిన ఆహారం, మార్కెట్ స్నాక్స్‌లను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.