Prevent Cough and Cold : వర్షాకాలంలో దగ్గు, జలుబును ఎలా నివారించాలి ?

ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. జలుబు వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో నారింజ, ఆపిల్ మొదలైన పండ్లు, బచ్చలికూర, కాలే మొదలైన ఆకుకూరలు, బాదం వంటి గింజలు మొదలైన వాటిని చేర్చుకోవటం మంచిది.

Prevent Cough and Cold : వర్షాకాలం  వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదే క్రమంలో తేమ పెరగడం, నీరు నిలిచిపోవడం, ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల దగ్గు , జలుబు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో దగ్గు, జలుబు అనేవి సాధారణ సమస్యలు. ఈ సమస్యలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే దగ్గు, జలుబు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

READ ALSO : Monsoon Diseases : డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు వర్షకాలంలో వచ్చే 5 సాధారణ వ్యాధులు, నివారణ చిట్కాలు !

జలుబు,దగ్గు రాకుండా జాగ్రత్తలు ;

పరిశుభ్రత పాటించటం ;

దగ్గు, జలుబును నివారించడంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమైన దశ. సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం , ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను ఉపయోగించాలి. సూక్ష్మక్రిములు చేతుల ద్వారా సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు చేతులతో ముఖాన్ని తాకడం మానుకోవాలి.

READ ALSO : Fever Season : జ్వరాల కాలం వర్షకాలం! జాగ్రత్తలే రక్షణ

హైడ్రేటెడ్ గా ఉండటం ;

పుష్కలంగా ద్రవపదార్దాలను తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లి రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. నీరు, పండ్ల రసాలు, హెర్బల్ టీలు, కొబ్బరి నీరు రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటానికి తోడ్పడతాయి.

READ ALSO : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు ఇవే!

పోషకాహారం తీసుకోవటం ;

ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. జలుబు వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో నారింజ, ఆపిల్ మొదలైన పండ్లు, బచ్చలికూర, కాలే మొదలైన ఆకుకూరలు, బాదం వంటి గింజలు మొదలైన వాటిని చేర్చుకోవటం మంచిది.

READ ALSO : Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

ఈ చిట్కాలను అనుసరించటం ద్వారా వర్షకాలంలో దగ్గు, జలుబుతో పాటు ఇతర వైరల్ ఇన్ ఫెక్షన్ భారి నుండి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసి చల్చార్చిన నీటిని మాత్రమే సేవించాలి. ఎక్కువ శాతం వ్యాధులు నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారానే వచ్చే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు