Prevent Diabetes : మధుమేహం ఎలా నివారించాలి ? ప్రారంభ దశలో ఉంటే ఏంచేయాలి ?

మధుమేహాన్ని నివారించడానికి, దాని లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి పలు మార్గాలు ఉన్నాయి. మధుమేహాన్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించటం. ఇది సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం, రోజువారి వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి ఉండటం ద్వారా సాధ్యమౌతుంది.

Prevent Diabetes

Prevent Diabetes : ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు మధుమేహమనే దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితితో బాధపడుతున్నారు. మధుమేహం అన్నది శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉత్పత్తి చేయలేనప్పుడు సంభవించే జీవక్రియ రుగ్మతగా నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఒక హార్మోన్. ఇది కణాలు శక్తి కోసం గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది.

READ ALSO : Blood Sugar And Cholesterol : రక్తంలో షుగర్ లెవల్స్ , కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి !

మధుమేహం తొలిదశలో సంకేతాలు తేలికపాటివిగా ఉంటాయి. చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోరు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

మధుమేహం యొక్క కొన్ని ప్రారంభ సంకేతాలు ;

1. పెరిగిన దాహం, మూత్రవిసర్జన :

అధిక రక్త చక్కెర స్థాయిలు శరీరం, కణజాలం నుండి ద్రవాన్ని బయటకు పంపేందుకు కారణం అవుతాయి. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఫలితంగా తరచుగా దాహం వేస్తుంది. ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయవలసి వస్తుంది.

READ ALSO : Sugar Levels : అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పడిపోతే ఏంచేయాలో తెలుసా?

2. అలసట, బలహీనత:

శరీరం గ్లూకోజ్‌ను సమర్ధవంతంగా ఉపయోగించలేకపోవడం వల్ల శక్తి లోపానికి దారితీస్తుంది. తగినంత నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఏకాగ్రత లోపం తలెత్తుతుంది.

3. బరువు తగ్గడం :

మధుమేహం ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం, అస్పష్టమైన దృష్టి , గాయాలు మానేందుకు ఎక్కువ కాలం పట్టటం ముఖ్యంగా చిగుళ్ళు మరియు మూత్ర నాళాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

READ ALSO : Almonds: బాదములు తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడతాయా?

మధుమేహ నివారణ మార్గాలు ;

అదృష్టవశాత్తూ, మధుమేహాన్ని నివారించడానికి, దాని లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి పలు మార్గాలు ఉన్నాయి. మధుమేహాన్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించటం. ఇది సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం, రోజువారి వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి ఉండటం ద్వారా సాధ్యమౌతుంది.

మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారం తీసుకోవటం అవసరం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు గణనీయమైన మొత్తంలో తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెంచే అవకాశం ఉన్నందున వాటిని దూరంగా ఉంచడం మంచిది.

READ ALSO : Ginger Juice : అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలను తగ్గించే అల్లం రసం!

మధుమేహం నివారణ, నిర్వహణలో వ్యాయామం మరొక కీలకమైన అంశం. రెగ్యులర్ శారీరక శ్రమ శరీరం గ్లూకోజ్‌ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. వారంలోకనీసం 30 నిమిషాల పాటు చురుకైన నడక వంటి తేలికపాటి వ్యాయామం చేసేందుకు ప్రయత్నించటం మంచిది.

డయాబెటిస్‌ను నివారించడానికి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి. ఊబకాయం అనేది ఈ పరిస్థితికి ముఖ్యమైన ప్రమాద కారకం, ఎందుకంటే ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియను దెబ్బతీస్తుంది. అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లయితే బరువు కోల్పోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు