Sleeping Improve Immunity : నిద్రపోతూ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.. ఎంత నిద్రపోతే ఆరోగ్యమంటే?

కంటినిండా నిద్రపోతే ఆరోగ్యమని అందరికి తెలుసు. అందుకే కనీసం 8 గంటలు నిద్ర అవసరమని చెబుతుంటారు.

Sleeping Improve Immunity : కంటినిండా నిద్రపోతే ఆరోగ్యమని అందరికి తెలుసు. అందుకే కనీసం 8 గంటలు నిద్ర అవసరమని చెబుతుంటారు. కంటినిండా నిద్రపోవడం ద్వారా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు వైద్య నిపుణులు. సరైన నిద్రలేనివారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

నిద్రపోవడం ద్వారా శరీరంలో ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఒక రోజులో మీరెంతసేపు నిద్ర పోతున్నారో తెలుసా? రాత్రి సమయాల్లో నిద్రచాలా ముఖ్యం.. ఆ సమయాల్లోనే శరీరంలోని అవయాలు సరి చేసుకుంటాయి.

అప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ మెమరీ టి కణాలను ఉత్పత్తి చేస్తుంది. శరీరం నిల్వచేసే రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుందని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం.. ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఎనిమిది గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందని తేలింది. వీరే ఎక్కువ వ్యాధుల బారిన పడతారు. ఎనిమిది గంటలు నిద్రపోయే వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా, 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారికి శరీరంలో అనారోగ్యాలు వస్తుంటాయి.

బరువు పెరగడంతో పాటు డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కంటినిండా నిద్రపోయేవారిలో ఎలాంటి వ్యాధులు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు