Zydus Cadila Virafin Drug : జైడస్ ‘విరాఫిన్’ డ్రగ్.. కరోనా వైరల్ లోడ్, ఆక్సిజన్ అవసరాన్ని ఎలా తగ్గించగలదు?

ప్రముఖ డ్రగ్ మేకర్ జైడస్ కాడిల్లా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ డ్రగ్ 'విరాఫిన్' వ్యాక్సిన్‌ కరోనా కేసుల్లో అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం ఆమోదం తెలిపింది.

Zydus Cadila Virafin Drug for Covid-19 Patients : ప్రముఖ డ్రగ్ మేకర్ జైడస్ కాడిల్లా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ డ్రగ్ ‘విరాఫిన్’ వ్యాక్సిన్‌ కరోనా కేసుల్లో అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం ఆమోదం తెలిపింది. విరాఫిన్ వాణిజ్యం పేరు జైడస్ కాడిల్లా అనే (Pegylated Interferon alpha-2b) చెందిన డ్రగ్. ఈ యాంటీవైరల్ డ్రగ్ లోని ప్రోటీన్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపితం చేస్తుందని ట్రయల్స్ లో తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ల స్థాయిని బట్టి ఈ డ్రగ్ ఇవ్వాలని సూచించినట్టు జైడస్ కాడిల్లా పేర్కొంది.

కరోనా బాధితుల్లో వైరల్ లోడ్ అధికంగా ఉండి.. ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ డ్రగ్ వైరస్ తీవ్రతను తగ్గిస్తుందని ప్రయోగ దశలో రుజువైంది. అందుకే ఈ మెడిసిన్ వైరల్ లోడ్ తగ్గించడానికి మాత్రమే కాకుండా ఆక్సిజన్ అవసరాన్ని కూడా తగ్గించగలదని సూచిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మూడో దశ ట్రయల్స్ సమయంలో ఫార్మా కంపెనీ విరాఫిన్ డ్రగ్ కరోనా బాధితులకు సింగిల్ డోసు చొప్పున ఇచ్చింది. కేవలం ఏడు వారాల్లోనే వైరల్ లోడ్ వేగంగా జీరో స్థాయికి పడిపోయేలా చేసిందని గుర్తించింది. దీని ఆధారంగానే డీసీజీఐ నుంచి ఈ డ్రగ్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఇప్పటికే హెపటైటీస్ సి చికిత్సలో ఈ డ్రగ్ వినియోగిస్తున్నారు.

2004లో కరోనా మొదటి వేరియంట్ వైరస్ విజృంభించగా.. ఆ సమయంలో ఈ విరాఫిన్ డ్రగ్.. SARS చికిత్సలో సమర్థవంతంగా పనిచేయగలదని రుజువైంది. అందుకే ఇప్పుడు SARS-CoV-2 వైరస్ కు కూడా ఇదే డ్రగ్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అత్యవసర వినియోగానికి ఆమోదంతో ఈ డ్రగ్ నిబంధనలతో మాత్రమే అందుబాటులోకి రానుంది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ సూచించిన ప్రిస్ర్కిప్షన్ ఆధారంగా మాత్రమే డ్రగ్ వాడేందుకు అనుమతి ఉంది. అందువల్ల, ఈ ఔషధాన్ని కోవిడ్ -19 రోగులకు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కౌంటర్ ద్వారా ఇవ్వడానికి వీలులేదు. ప్రతి యాంటీ వైరల్ డ్రగ్ లో ఏదొక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది.

ఇందులో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఔషధం తీసుకున్న కొంతమందిలో ఇన్ఫ్లూయింజా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రక్తంలో మార్పు, న్యూరో-సైకియాట్రిక్ దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ డ్రగ్ తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలో అత్యంత ప్రాధాన్యం పొందిన డ్రగ్.. Remdesivir.. ప్రస్తుతం కరోనా బాధితుల్లో చాలామందికి ఇదే డ్రగ్ సూచిస్తున్నారు. Fabiflu అనే డ్రగ్ కూడా ఉంది. ఈ డ్రగ్స్ అన్నీ యాంటీ వైరల్ డ్రగ్స్.. కరోనా బాధితుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి కూడా. కరోనాకు సరైన చికిత్స ఇప్పటివరకూ అందుబాటులో లేకపోవడంతో ఈ తరహా యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతోంది. జైడస్ కాడిల్లా తయారుచేసిన విరాఫిన్ డ్రగ్ కూడా కరోనా తీవ్రతను తగ్గించగలదని కంపెనీ భావిస్తోంది. కరోనా మరణాల రేటు కూడా భారీగా తగ్గిస్తుందని అంటోంది.

ట్రెండింగ్ వార్తలు