Good Sleep : హాయిగా నిద్రపోవాలా..? అయితే ఈ పువ్వు దిండు కింద పెట్టుకోండీ..

హాయిగా నిద్రపోవాలని మంచంమీద పడుకుంటే నిద్రే పట్టడు.నిద్రాదేవి కరుణించాలని మంచంపై అటు ఇటు దొర్లుతాం. ఉహూ..కంటిమీదకు కునుకే రాదు. నిద్ర పట్టకపోతే కోపం, చికాకు వంటివి సర్రుమంటూ వచ్చేస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.అటువంటి నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం ఈ పువ్వు. ఈ పువ్వు దిండు కింద పెట్టుకుంటు క్షణాల్లో నిద్ర వచ్చేస్తుంది.

henna tree flowers

Good sleep Flower : హాయి నిద్రపోయి ఎన్నాళ్లు అవుతుందో అనే మాట తరచు వినిపిస్తోంది. ఈ రోజుల్లో హాయిగా నిద్రపోయే పరిస్థితి లేదు. పని ఒత్తిడి,ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడితో నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలు ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. నిద్ర మనిషికే కాదు ప్రతీ జీవికి చాలా అవసరం. కానీ చాలామందికి నిద్ర అంటేనే ఓ పెద్ద యుద్ధంలా మారుతోంది. నిద్ర పోవాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. దీనికి యువత కూడా అతీతం కాదు. కొంతమంది నిద్ర కోసం స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంటారు.మరికొందరు ఆల్కాహాల్ తీసుకుంటుంటారు. ఈ రెండు మంచిది కాదు. పైగా ఇవి తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం కానేకాదు..పైగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

ప్రతీ మనిషికి నిద్ర చాలా చాలా అవసరం. నిద్రల్లో చాలా రకాలున్నాయి. కలత నిద్ర, మొద్దు నిద్ర, సుఖ నిద్ర, గాఢ నిద్ర ఇలా పలు రకాలు ఉన్నాయి. కానీ వీటిలో సుఖ నిద్ర ఆరోగ్యానికి మంచిది. నిద్ర పోవటం అంటే శరీరం పూర్తి విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉండాలి. అంతే తప్ప ఏదో నిద్రపోవాలి కాబట్టి పడుకోవాలి అనేలా ఉండకూడదు. నిద్రపోయి లేచాక మనస్సు, శరీరం ఉత్సాహంగా ఉండాలి. పుల్ రీఫ్రెష్ అయినట్లుగా ఉండాలి. అటువంటి నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి నిద్ర పట్టేందుకు ప్రకృతి ఇచ్చిన వరం ఓ చిన్న పువ్వు..

Black thread : కాలికి కట్టుకునే నల్లతాడుకు ఎన్ని ముడులు వేయాలో తెలుసా..?

నిద్రలేమి సమస్యకు చిన్న పువ్వు పరిష్కారం చూపిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మనిషికి ఇచ్చే ఎన్నో వరాల్లో ఈ చిన్ని పువ్వు సుఖ నిద్రను ఇస్తుందని చెబుతున్నారు. అదే గోరింట పువ్వు..ఈ పువ్వు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుందట. గోరింట ఆకు అంటే మగువలకు ఎంతో ఇష్టం. చేతుల్ని ఎర్రగా పండిస్తుంది. మగువల చేతుల్ని అందంగా చేయటమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అటువంటి గోరింట్ పువ్వు నిద్ర సమస్యకు పరిష్కారం అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. గోరింట మొక్కకు గుత్తులు గుత్తులుగా పూస్తాయి పువ్వులు. ఈ పువ్వులు మంచి సువాసనతో గుభాళిస్తుంటాయి. గోరింట్ పూల గుత్తిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే చక్కగా నిద్ర పడుతుందట.

Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు లీటరు రూ. 18లక్షలట..!!

ఈ పువ్వు నుంచి వచ్చే సువాసన మంచి నిద్ర పట్టేలా చేస్తుందట. చిన్నపిల్లలు ఎంత హాయిగా నిద్రపోతాయిరో అలాంటి నిద్ర పట్టాలంటే గోరింట్ పువ్వుల గుత్తి ఒకటి తెచ్చుకుని దిండు కింద పెట్టుకుంటే చక్కటి సుఖ నిద్ర పడుతుందట. మరి మీరు కూడా ఓ సారి వాడి చూడండీ..చక్కని ఫలితం ఉంటుందని చెప్తున్నారు. గోరింట పువ్వుల కోసం రూపాయి పెట్టి కొననక్కరలేదు. ఓసారి ట్రై చేసి చూస్తే పోయేదేముంది..?