Black thread : కాలికి కట్టుకునే నల్లతాడుకు ఎన్ని ముడులు వేయాలో తెలుసా..?
మహిళలు, యువతులు కాళ్లకు నల్లటి దారాలు కట్టుకోవటం ట్రెండ్ గా మారింది. కాళ్లకు కట్టుకునే దారాల్లో రకరకాల మోడల్స్ కూడా వచ్చాయి. నల్లతాడుకు మరింత అందాన్ని ఇచ్చేలా నమ్మకానికి మరిన్ని సొగసులు అద్దుతున్నారు. పూసలు, కుందన్లు,మువ్వలు, చిన్న లాకెట్ లాంటివి ఉండేలా ట్రెండ్లీగా ధరిస్తున్నారు. కాళ్లకు ఈ నల్లదారాలు ఫ్యాషన్ కోసమా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..?

Black threads on the legs
Womens legs Black thread : ఒకప్పుడు చంటిబిడ్డలకు కాళ్లకు చేతులకు నల్ల దారాలు కట్టేవారు. దృష్టి తగలకుండా ఉండేందుకు చంటిబిడ్డలకు రెండు చేతులకు, రెండు కాళ్లకు నల్లటి దారాలు కట్టేవారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్లు కూడా కట్టుకుంటున్నారు. మహిళలు, యువతులు కాళ్లకు నల్లటి దారాలు కట్టుకుంటున్నారు. ఇదొక ట్రెండ్ గా మారింది. కాళ్లకు కట్టుకునే దారాల్లో రకరకాల మోడల్స్ కూడా వచ్చాయి. నల్లతాడుకు మరింత అందాన్ని ఇచ్చేలా నమ్మకానికి మరిన్ని సొగసులు అద్దుతున్నారు. పూసలు, కుందన్లు,మువ్వలు, చిన్న లాకెట్ లాంటివి ఉండేలా ట్రెండ్లీగా ధరిస్తున్నారు. కాళ్లకు ఈ నల్లదారాలు ఫ్యాషన్ కోసమా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనేది తెలుసుకుందాం..
నల్లటి తాడును కట్టుకునే విషయంలో చాలా నమ్మకాలే ఉన్నాయి. కొంతమంది చేతికి,కాలికి,మెడకి కూడా కట్టుకుంటూ ఉంటారు. గతంతో ఇలా చేతికి నల్లటి తాడు కట్టుకుంటే దాన్ని కాశీ తాడు అనేవారు. కానీ ఇప్పుడదే ట్రెండ్ గా మారింది. ఇది ట్రెండ్ గా మారటం కూడా మంచిదేనంటున్నారు పండితులు. నల్లతాడు కాలికి కట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతున్నారు. చంటిబిడ్డలకు అందుకే కట్టేవారని చెబుతున్నారు. అంటే దృష్టి దోషం వంటివి తగలకుండా కట్టేవారని చెబుతున్నారు.
Buckets : బాత్రూమ్‌లో ఈ రంగు బకెట్లు, మగ్గులు ఉంటే అరిష్టమట .. మరి ఎలాంటివి ఉండాలి..?
అలాగే దారాలు కట్టుకునే సమయంలో చాలా అనుమానాలు వస్తుంటాయి. ఎన్ని ముడులు వేయాలి..? అని.. కానీ తాడుని కట్టుకోవటానికి ముందు దానికి తొమ్మిది ముడులు వేసి కట్టుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే చేతికి కట్టుకోవాలనుకంటే రెండు లేదా నాలుగు, ఆరు, ఎనిమిది సార్లు తిప్పి అంటే రెండు నుంచి ఎనిమిది వరుసలుగా కట్టుకోవాలని సూచిస్తున్నారు. అంటే చేతికి కట్టుకునే తాడు సరి సంఖ్యల వరుసలో ఉండాలట. అలాగే ఈ నల్లతాడుని శని దేవుడిని పూజించి ఆ తర్వాత ఆ తాడుని కట్టుకుంటే చెడు కలగకుండా ఉంటుందట.శని చూపు మీద పడదట.
అలాగే మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుందట. చేతికి కాళ్లకు నల్లటి తాడు కట్టుకుంటే మరి ఏ ఇతర తాడు కట్టుకోకూడదట. అలాగే వాహనాలకు,ఇంటికి నల్లతాడుతో నిమ్మకాయలు కడితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుందని..శుభాలు కలుగుతాయని సూచిస్తున్నారు.అలాగే ఎడమ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా..భారతదేశంలో చాలా విషయాలు నమ్మకాలపైనే ఆధారపడి ఉంటాయి. అటువంటిదే ఈ తాడులు కట్టుకునే విషయం కూడా. అది వారి వారి నమ్మకాలపై ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.