Lifespan of a building
Lifespan of a building : ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. వారి కలలకు తగ్గట్లు అన్ని సౌకర్యాలతో నిర్మించుకుంటారు. కొన్ని తాతలు, తండ్రుల నుంచి ఆస్తిగా వస్తాయి. ఏది ఏమైనా ఒక మనిషి తన జీవితకాలం అందులో ఉండేలా ఇంటిని నిర్మించుకుంటాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే కట్టుకున్న ఇల్లు జీవితకాలం ఎలా నిర్ణయించడం.. అది శిథిలావస్థకు చేరుకుందని ఎలా తెలుసుకోవడం.. చదవండి.
Bridge Collapse : బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
స్ట్రక్చరల్ ఇంజనీర్ల చెప్పే దాని ప్రకారం కాంక్రీట్‌తో కట్టిన ఏ నిర్మాణం అయినా 75 నుంచి 100 సంవత్సరాల వరకు స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్ల విషయానికి వస్తే ఇండిపెండెంట్ హౌస్‌ల జీవితకాలం ఎక్కువ. అపార్ట్మెంట్ల జీవితం 50-60 సంవత్సరాలు మాత్రమే. ఇవి ఎన్ని సౌకర్యాలతో నిర్మించుకున్నా వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే సరైన నిర్వహణ ఉంటే దాని జీవితకాలాన్ని 10%-20% మెరుగుపరచవచ్చు.
అయితే భవనాలు జీవితకాలం దెబ్బ తినడం వెనుక కారణాలు చాలా ఉంటాయి. 75 సంవత్సరాలు గడిచేసరికి కాంక్రీటు పగుళ్లు ఏర్పడటం, గోడలపై పెయింట్ మసక బారడం, లోపల గోడలు దెబ్బ తినడం, పవర్ కేబుల్స్, వాటర్ పైప్‌లైన్‌లు, ఫ్లోరింగ్, విండో, డోర్ అతుకులు, వాటర్ ప్రూఫింగ్ వంటి వాటితో పాటు నిర్మాణ నాణ్యత తక్కువగా ఉంటే ఇల్లు కాలానికి ముందే పాతబడిపోతుంది. శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివాసం ఉంటే అవి అకస్మాత్తుగా కూలి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు.
ఇల్లు కట్టడానికి ముందు సరైన జాగ్రత్తలు పాటించాలి. మనం నివసించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల్ని కూడా అంచనా వేసుకోవాలి. తీర ప్రాంతంలో నివసించేవారు తీవ్రమైన వేడి, తేమను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నగరాల్లో అధిక వర్షపాతం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో నిర్మాణంలో పగుళ్లు, తేమ ఏర్పడవచ్చు. వీటిని ఇల్లు కట్టేటపుడు పరిగణనలోకి తీసుకోవాలి. గోడల వాటర్ ప్రూఫింగ్, నాణ్యమైన పెయింట్ కూడా ఇంటి ఆయుష్షును పెంచుతుంది. తీర ప్రాంతాల్లో నివసించేవారు నిర్మాణంలో మెటల్ ఉపయోగించకూడదు. ఎందుకంటే సముద్రపు గాలిలో ఉండే ఉప్పు వల్ల మెటల్ వస్తువులు త్వరగా తుప్పు పట్టేస్తాయి. బాల్కనీలకు కూడా మెటల్ రెయిలింగ్‌లు కాకుండా చెక్క రెయిలింగ్‌లు ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఇంటిని నిర్మించే ముందు నాణ్యమైన వస్తువులతో నిర్మాణం చేపట్టండి. అదే మీ ఇంటి జీవితకాలాన్ని పెంచుతుంది.