Bridge Collapse : బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Bridge Collapse : బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

bridge collapse

Updated On : June 24, 2023 / 10:41 PM IST

Under Construction Bridge : బీహార్ లో గత కొన్ని రోజులుగా వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. శనివారం కిషన్ గంజ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్ప కూలింది. రెండు వారాల్లో వంతెన కూలడం రెండో ఘటన. మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తుందని చెప్పారు. కిషన్ గంజ్, కలిహార్ ను అనుసంధానం చేసే ఈ వంతెనను మెచ్చి నదిపై నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

Vinod Kumar : మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్పందించి.. ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాలి : వినోద్ కుమార్

కాగా, జూన్ 4వ తేదీన బీహార్ లోని ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. ఖగారియా జిల్లాను భాగల్పూర్ తో అనుసంధానించే ఆ వంతెన కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక సెక్యూరిటీ గార్డు మృతి చెందారు.

2019 నవంబర్ లో పూర్తి కావాల్సిన ఆ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై బీహార్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పూర్తైన నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలకు స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.