Indian Filter Coffee : ‘ప్రపంచంలో టాప్ 38 కాఫీలు’ జాబితాలో మన ‘ఫిల్టర్ కాఫీ’కి రెండో ర్యాంకు..!

Indian Filter Coffee : ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్‌అట్లాస్ విడుదల చేసిన 'ప్రపంచంలో టాప్ 38 కాఫీలు' జాబితాలో ఇండియన్ ఫిల్టర్ కాఫీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Indian Filter Coffee, Top 38 Coffees World, Indian Filter Coffee Rank, TasteAtlas, South Indian Coffee

Indian Filter Coffee : కాఫీ వాసన తగిలితే చాలు.. కాఫీ ప్రియుల్లో లాలాజాలం ఊరిపోతుంది. ఆహా ఏమి రుచి.. తాగరా కాఫీ మైమరిచి.. అంటూ టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు. అలాంటి రుచికరమైన కాఫీకి ఎంతో చరిత్ర ఉంది. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగకుండా ఆ రోజు మొదలుకాదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా రుచికరమైన కాఫీలలో మన కాఫీ రుచే వేరు.

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కాఫీ గింజలతో డిఫరెంట్‌గా తయారు చేస్తుంటారు. అలాంటి కాఫీలకు సంబంధించిన జాబితాను ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫారమ్ అయిన టేస్ట్అట్లాస్ (TasteAtlas) ఇటీవల ‘ప్రపంచంలోనే టాప్ 38 కాఫీలు’ రేటింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ కొత్త రేటింగ్ జాబితాలో ‘క్యూబన్ ఎస్ప్రెస్సో’ అగ్రస్థానంలో నిలవగా.. రెండో ర్యాంకులో మన ‘సౌత్ ఇండియన్ కాఫీ’ నిలిచింది.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

‘డార్క్ రోస్ట్ కాఫీ’ నెంబర్ వన్‌ :
టేస్ట్అట్లాస్ ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 10 కాఫీల జాబితాలో ‘క్యూబన్ ఎస్ప్రెస్సో’ డార్క్ రోస్ట్ కాఫీ నెంబర్ వన్ ర్యాంకును తగ్గించుకుంది. ఈ కాఫీ తయారీలో పంచదారను ఉపయోగిస్తారు. అంతేకాదు.. తియ్యనైన ఎస్ప్రెస్సో షాట్‌ను కూడా కలిగి ఉంటుంది. కాఫీ కాచేటప్పుడు ఇందులో చక్కెర కలుపుతారు. స్టవ్‌టాప్ ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్‌లో తయారు చేస్తారు. తయారీ చేసే విధానం కూడా కాస్తా కొత్తగా ఉంటుంది. కాఫీ పైన లేత గోధుమ రంగు నురుగు కూడా వస్తుంది.

మన ఫిల్టర్ ’కాఫీ‘ తయారీ ఇలా :
అదే.. మన భారతీయ ఫిల్టర్ కాఫీ విషయానికి వస్తే.. కాఫీ ఫిల్టర్ యంత్రాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ మెషిన్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది. రెండు గదులుగా ఉంటుంది. పైభాగంలో చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇక దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు వస్తుంది. అయితే, దక్షిణ భారతదేశంలో ఈ కాఫీ తయారీ విధానం అత్యంత ప్రాచుర్యం పొందింది.

అనేక మంది రాత్రిపూట కాఫీ ఫిల్టర్‌ను ఏర్పాటు చేసుకుని తద్వారా ఉదయాన్నే తాజాగా కాఫీని తయారు చేసుకుంటారు. ఈ కాఫీ మిశ్రమంలో వెచ్చని పాలు, చక్కెరతో కలుపుతారు. ఈ కాఫీ స్టీల్ లేదా ఇత్తడితో చేసిన చిన్న గాజు లాంటి టంబ్లర్‌లో సర్వ్ చేస్తారు. అలాగే ‘దబారా’ అనే చిన్న గిన్నె లాంటి సాసర్ కూడా ఉంటుంది. కాఫీని ఇతరులకు అందించే ముందు తరచుగా ఒక పాత్రలో నుంచి మరొక పాత్రలోకి పోస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాఫీ నురుగు ఎక్కువగా వస్తుంది. టేస్ట్అట్లాస్ ప్రకటించిన టాప్ రేటింగ్ కాఫీల 10 ర్యాంకుల జాబితాలో ఏయే దేశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా)
2. సౌత్ ఇండియన్ కాఫీ (భారత్)
3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)
4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్)
5. కాపుచినో (ఇటలీ)
6. టర్కిష్ కాఫీ (టర్కీయే)
7. రిస్ట్రెట్టో (ఇటలీ)
8. ఫ్రాప్పే (గ్రీస్)
9. ఐస్కాఫీ (జర్మనీ)
10. వియత్నామీస్ ఐస్‌డ్ కాఫీ (వియత్నాం)

Read Also : Health Effects of Tea: టీ తాగుతున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు