Anxiety Disorders
Anxiety Disorders : ఆందోళన అనేది భౌతికంగా కనిపించే ఒక సాధారణ భావోద్వేగం. మెదడు ఒత్తిడికి గురైనప్పుడు రాబోయే ప్రమాదానికి ముందస్తుగా హెచ్చరికనిస్తుంది. ఆందోళన సమస్యతో బాధపడేవారిలో భయం అనేది దీర్ఘకాలం కొనసాగుతుంది. అధికంగా చెమటలు పట్టడం, భయం కలగటం అన్నది ఆందోళనకు సాధారణ లక్షణాలు. కొన్ని సందర్భాల్లో నిద్రసరిగా పట్టదు.
READ ALSO : Prevent Postpartum Depression : ప్రసవానంతరం తల్లులలో డిప్రెషన్‌ను నివారించే ఆహారాలు !
ఆందోళన మన దైనందిన జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది ప్రవర్తనా మార్పులకు కూడా కారణం కావచ్చు. ఇతరులను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించడం ఆందోళన సంకేతాలలో ఒకటి. మనం ఎవరినైనా, ఏదైనా పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా దాని గురించి పదేపదే ఆలోచనతో ఉంటాము. అయితే, ఆందోళనలో, ప్రజలు కొన్నిసార్లు కీలక విషయాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు.
నియంత్రించే సంకేతాలు :
ఓవర్ ప్రొటెక్టివ్: మనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ఇతర వ్యక్తుల పట్ల అసూయ కలగి ఉండటం అన్నది ఆందోళనకు దారితీస్తుంది.
మైక్రోమేనేజింగ్: మనం ఎక్కువగా విషయాలను మనమే నిర్వహించడానికి ప్రయత్నిస్తాము. అవి మనకు అనుకూలంగా ఉండని సందర్భంలో చాలా కోపంగా ఉంటాము.
READ ALSO : Ratan Tata : వర్షాకాలంలో కారు నడిపే ముందు రతన్ టాటా ఇచ్చే సూచన పాటించండి
పనిని అప్పగించడం: పనిని ఇతరులకు అప్పగించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాము. ప్రతిదాన్ని మనమే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము. మనం ఇతరులను పని చేయమని అడిగితే, అది మనకు కావలసిన విధంగా జరగదేమోనని భయపడతాము.
అతిగా ఆలోచించడం: ప్రణాళికలు వేసుకుని, పనులను ఎలా పూర్తి చేయాలో ఆలోచిస్తారు చాలా మంది. ఇది ఎక్కువగా ఆలోచించడం ,దాని గురించి భయాందోళనలకు గురిచేస్తుంది.
ఇతరులను మార్చడం: తరచుగా ఆందోళన ఎందుకు కలుగుతుందంటే మనం కొన్ని విషయాలు, వ్యక్తులను మార్చే విధానంపై అధిక దృష్టి పెడతాము.
READ ALSO : Samantha : సమంతకు మయోసైటిస్ ఇంకా తగ్గలేదా? చికిత్స కోసం అమెరికాకు.. అందుకే సినిమాలకు బ్రేక్?
మార్పు: ఆందోళన మనల్ని ప్రకృతిలో చాలా కఠినంగా మారుస్తుంది. చివరి నిమిషంలో మార్పులను స్వాగతించదు.
ఆందోళనను నయం చేయలేము, అయితే పెద్ద సమస్యగా మారకుండా నిరోధించడానికి మార్గాలు ఉన్నాయి. ఆందోళనకు సరైన చికిత్సను పొందడం వలన ఆందోళనలను అదుపులో ఉంచుకుంటూ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందేందుకు జీవనశైలి మార్పులు ప్రభావవంతగా తోడ్పడతాయి.
తగినంత నిద్ర, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం, మద్యం అలవాటు మానుకోవటం, రోజువారి వ్యాయామాలు, కెఫిన్, సిగెరెట్ వంటి వాటికి దూరంగా ఉండటం వంటివి ఆందోళనను తగ్గించటంలో తోడ్పడతాయి.