Prevent Postpartum Depression : ప్రసవానంతరం తల్లులలో డిప్రెషన్‌ను నివారించే ఆహారాలు !

డిప్రెషన్‌తో పోరాడుతున్న చాలా మంది కొత్తగా తల్లులైన వారు తమను , తమ బిడ్డను కూడా బాగా చూసుకోలేరు. ఈ సమయంలో అలాంటి వారికి కొన్ని ఆహారాలు వారి ఆరోగ్యం, మానసిక స్థితి , మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.

Prevent Postpartum Depression : ప్రసవానంతరం తల్లులలో డిప్రెషన్‌ను నివారించే ఆహారాలు !

Prevent Postpartum Depression

Prevent Postpartum Depression : మహిళలు జీవితంలో మాతృత్వం పొందటం అన్నది ఒక అదృష్టంగా, ఒక వరంగా భావిస్తారు. ఈ ప్రయాణంలో కొంతమంది మహిళలు అనేక ఆరోగ్య పరమైన సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. ప్రసవించిన తర్వాత చాలా మంది మహిళలు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. విచారంగా, నిస్సహాయంగా, చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలను చాలా మంది తల్లులు అనుభవించాల్సి వస్తుంది.

READ ALSO : Blood Pressure : గర్భధారణ సమయంలో రక్తపోటు సమస్య!

సర్వేల ప్రకారం ప్రతి 7 మందిలో ఒకరు ప్రసవానంతరం డిప్రెషన్ కు లోనవుతున్నట్లు నిర్ధారించారు. ఈ ప్రభావం అన్నది నవజాత శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఒక స్త్రీ తల్లి అయిన తర్వాత శరీరం, మనస్సులో వరుస మార్పులకు లోనవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు కొత్త తల్లైన వారిని జాగ్రత్తగా చూసుకోవడం ,వారి యోగక్షేమాలను క్రమం తప్పకుండా విచారించడం చాలా ముఖ్యం.

డిప్రెషన్‌తో పోరాడుతున్న చాలా మంది కొత్తగా తల్లులైన వారు తమను , తమ బిడ్డను కూడా బాగా చూసుకోలేరు. ఈ సమయంలో అలాంటి వారికి కొన్ని ఆహారాలు వారి ఆరోగ్యం, మానసిక స్థితి , మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. కాబట్టి ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో పోషకాహారం కీలకపాత్ర పోషిస్తుంది.

READ ALSO : Ajwain Seeds : చలికాలంలో శ్వాస సమస్యలు దూరం చేసే వాము

ప్రసవానంతర డిప్రెషన్ నివారణకు పోషకాహారానికి మధ్య సంబంధం ;

ప్రసవం తరువాత కోలుకోవడం, నవజాత శిశువు సంరక్షణకు స్త్రీ శరీరం అనేక శారీరక, మానసిక మార్పులకు గురవుతుంది. ఈ కాలం స్త్రీ ఆరోగ్యానికి కీలకమైన సమయం. రికవరీ అయ్యేందుకు సరైన పోషకాహారం అవసరం. ఈ సమయంలో ఎలాంటి పోషకాలు అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ;

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరు , అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన కొవ్వులు. ప్రసవానంతర డిప్రెషన్‌ను నివారించడంలో ఈ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని అధ్యయనాలు గర్భధారణ సమయంలో , ప్రసవానంతర కాలంలో ఒమేగా-3 సప్లిమెంట్ డిప్రెషన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్, సార్డినెస్ మరియు మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో అలాగే అవిసె గింజలు, వాల్‌నట్స్ వంటి గింజలు , విత్తనాలలో లభిస్తాయి.

READ ALSO : Breast Milk : తల్లి పాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికమా?…

2. విటమిన్ డి ;

విటమిన్ డి ఎముక ఆరోగ్యానికి , రోగనిరోధక పనితీరుకు అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇటీవలి పరిశోధనలు విటమిన్ D యొక్క తక్కువ స్థాయిలు ప్రసవానంతర డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి. విటమిన్ డి , డిప్రెషన్ మధ్య సంబంధాన్ని తెలసుకునేందుకు నేటీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. విటమిన్ డి కొవ్వు చేపలు, గుడ్డు సొనలు మరియు పాలు మరియు తృణధాన్యాలు వంటి బలవర్థకమైన ఆహారాల ద్వారా పొందవచ్చు.

READ ALSO : Breastfeeding : చండిబిడ్డలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే ఆరోగ్యానికి మంచిదంటే?

3. ఇనుము ;

ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆక్సిజన్ రవాణాకు అవసరమైన ఖనిజం. గర్భధారణ సమయంలో తక్కువ స్థాయిలో ఇనుము ఉన్న స్త్రీలు ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలను ఎక్కువగా అనుభవిస్తారని కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో తగినంత ఐరన్ స్థాయిలు ఉన్న స్త్రీలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం తక్కువ. ప్రసవానంతర డిప్రెషన్ ఎదుర్కోవడానికి ఆహారంలో ఇనుము అధికంగా ఉండే మూలాలను చేర్చడం చాలా అవసరం. లీన్ రెడ్ మీట్, పౌల్ట్రీ, చేపలు మరియు ఆకు కూరలలో ఐరన్ లభిస్తుంది.

READ ALSO : స్ట్రెచ్‌మార్క్స్ పోవాలంటే..ఇలా చేయండీ..

4. బి విటమిన్లు ;

B విటమిన్లు శక్తి జీవక్రియ, మెదడు పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని అధ్యయనాలు ఫోలేట్ మరియు విటమిన్ B12తో సహా కొన్ని B విటమిన్ల తక్కువ స్థాయిలు ప్రసవానంతర డిప్రెషన్ ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చని సూచించాయి. జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, తక్కువ స్థాయిలో ఫోలేట్ , విటమిన్ B12 ఉన్న స్త్రీలు డిప్రెషన్ లక్షణాలను అనుభవించే అవకాశం ఉంది. B విటమిన్లు ఆకు కూరలు, తృణధాన్యాలు మరియు బలవర్థకమైన తృణధాన్యాలను తీసుకోవటం ద్వారా పొందవచ్చు.

READ ALSO : Ovarian Cancer : అండాశయ క్యాన్సర్ అసాధారణ లక్షణాలు.. ఈ సైలెంట్ కిల్లర్‌ని ఎలా గుర్తించాలి ?

ప్రసవానంతర డిప్రెషన్ కు అనుసరించాల్సిన ఆహార పద్ధతులు ;

వ్యక్తిగత పోషణతో పాటు, డిప్రెషన్ నివారణకు కొన్ని ఆహార విధానాలు ముడిపడి ఉంటాయని పరిశోధనలో తేలింది. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారంలో సమృద్ధిగా ఉండే ఆహార విధానం. ఆలివ్ ఆయిల్ మరియు గింజలు వంటి కొవ్వులు వంటివి తీసుకోవటం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, ఫాస్ట్ ఫుడ్, చక్కెర/కార్బోనేటేడ్ వంటి ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన ఆహారాలు ఎక్కువగా ఉండే ఆహారం పానీయాలు , స్నాక్స్ వంటివి ప్రసవానంతర డిప్రెషన్ ను మరింత పెంచుతాయి.