Ajwain Seeds : చలికాలంలో శ్వాస సమస్యలు దూరం చేసే వాము

వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు సైతం ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. పంటినొప్పి ఉన్నవారు వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించినట్లైతే ఉపశమనం లభిస్తుంది..

Ajwain Seeds : చలికాలంలో శ్వాస సమస్యలు దూరం చేసే వాము

Ajwain Seed

Ajwain Seeds : సాధారణ మసాలా దినుసులలో వాము ఒకటి. ప్రతి ఒక్కరి వంటింట్లో వాము అనేది ఖచ్చితంగా ఉంటుంది. కడుపు నొప్పి, గ్యాస్, గాలి, కడుపు నొప్పి మరియు అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యలను తొలగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని మెరుగుపరచడంలో, అతిసారం, మలబద్ధకానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాము జీర్ణశక్తికి మంచిది. చూడటానికి జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, ఇది చేసే మేలు మాత్రం అంతా ఇంతా కాదు.

వాము వాటర్ తాగించటం వల్ల చిన్నపిల్లల్లో జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. వాము ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రోజూ ఉదయం 2 నుంచి 3 టీస్పూన్ల వాము ఖాళీ కడుపుతో తినడం వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఈ విధంగా 2 నుండి 3 నెలల వరకు నిరంతరం చేయండం వల్ల కొవ్వు తగ్గుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. శీతాకాలంలో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ వాము, 10 పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరుగుతున్నప్పుడు పొయ్యి మీద నుంచి దించి.. ఆవిరిని కొంతసేపు ముక్కుతో..కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు త్వరగా వచ్చేస్తుంది.

వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి. వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఈ వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. అస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు సైతం ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. పంటినొప్పి ఉన్నవారు వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించినట్లైతే ఉపశమనం లభిస్తుంది.. దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు. దంత సమస్యలకు చెక్ పెట్టడంలో వాము తోడ్పడుతుంది. వామును మెత్తగా దంచి మజ్జిగలో కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి.