Rice
Rice : ప్రధాన ఆహారాలలో అన్నం ఒకటి. అన్నం సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్నం తింటే త్వరగా అరిగిపోతుంది. చాలా మందికి అన్నం అంటే చాలా ఇష్టం. రైస్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనితో పాటు ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అన్నం తినటం వల్ల అందులో ఉండే పిండి పదార్ధాలు చక్కెర స్ధాయిలను పెంచుతాయి. రాత్రిపూట అన్నం తినాలా వద్దా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అన్నంతినటం వల్ల అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ శరీరానికి అందుతాయి. శరీరానికి శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్ల నుంచి లభించే శక్తితో మనం మన రోజు వారీ పనులను సులభంగా చేసుకుంటాం.
అన్నం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని, అన్నం కార్బ్‌తో కూడినదని , బరువు తగ్గాలంటే అన్నం తినడం మానుకోవాలన్న ప్రచారం సాగుతుంది. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రాత్రిపూట పప్పు అన్నం వంటి భోజనాన్ని తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట అన్నం విషయంలో తెల్లబియ్యం కంటే బ్రౌన్ రైస్ తినమని సూచిస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో బ్రౌన్ రైస్ తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు. బ్రౌన్ రైస్‌లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జింక్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. అతిగా తినడాన్ని నివారించడి. అన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం. భోజనంలో ప్రోటీన్ మరియు మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అతిగా తినకుండా తేలికగా అన్నం తీసుకోవటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉండవు.