Breastfeed : మొదటి 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం మంచిదా ?

ఇది పిల్లలలో ఆస్తమా, టైప్ I మధుమేహం, ఆహార అలెర్జీలు మరియు ఊబకాయం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలు మంచి మేధస్సును కలిగి ఉంటారు. అందుకే పుట్టిన గంట లోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి.

benefits of breastfeeding

Breastfeed : ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆరు నెలల వయస్సు వరకు శిశువులకు తల్లిపాలను ఇచ్చేలా ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఇది తల్లి , బిడ్డ ఇద్దరికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి. ఆరునెలల కాలం శిశువుకు కేవలం తల్లి పాలను తాగించటం, వైద్యుల సలహా మేరకు అవసరమైన సప్లిమెంట్‌లు, మందులు తప్ప ఇతర ఘనపదార్థాలు, ద్రవాలను ఇవ్వకూడదు.

READ ALSO : Bodybuilding : సురక్షితమైన బాడీబిల్డింగ్ కోసం అనుసరించాల్సిన మార్గాలు

శిశువు జీవితంలో మొదటి ఆరునెలలకు అవసరమైన శక్తిని , పోషకాలను తల్లిపాలు అందిస్తుంది. వీటికి మించి శిశువుకు ఇంకేమీ అవసరం లేదు. తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. తల్లిపాలు నవజాత శిశువులలో అతిసారం, మరియు ఎగువ శ్వాసకోశ అంటువ్యాధులు (జలుబు, దగ్గు) వంటి అనేక అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

READ ALSO : Actress Praneetha: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో బాదం ఉండాల్సిందే

ఇది పిల్లలలో ఆస్తమా, టైప్ I మధుమేహం, ఆహార అలెర్జీలు మరియు ఊబకాయం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలు మంచి మేధస్సును కలిగి ఉంటారు. అందుకే పుట్టిన గంట లోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి.

READ ALSO : Monsoon Tips : వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి చిట్కాలు !

ఇలా ఇవ్వటం వల్ల శిశువు యొక్క అభివృద్ధితోపాటు తల్లి,శిశువు అనుబంధానికి తోడ్పడుతుంది. తిరిగి వెంటనే గర్భాన్ని ధరించటకుండా ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. చండి బిడ్డ పుట్టినప్పటి నుండి 24 గంటల్లో కనీసం 8 సార్లు పగలు , రాత్రి సమయాల్లో పాలు ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.