Israel Covid Variant : ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్.. లక్షణాలివే? ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారంటే?

Israel Covid Variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తగ్గిపోయిందిలే అని ప్రపంచ జనాభా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త కరోనా వేరియంట్ విజృంభించింది.

Israel Covid Variant : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తగ్గిపోయిందిలే అని ప్రపంచ జనాభా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త కరోనా వేరియంట్ విజృంభించింది. ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. ఆ దేశంలో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్టు నిర్ధారించారు. వారిలో కొత్త వేరియంట్ లక్షణాలు ఉన్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. కానీ, ఈ కొత్త వేరియంట్‌లను గుర్తించే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇజ్రాయెల్ నుంచి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ నివేదికలపై ఇంకా స్పందించలేదు.

నివేదికల ప్రకారం.. కొత్త వేరియంట్ కోవిడ్-19 వైరస్ ఒమిక్రాన్ వెర్షన్ రెండు సబ్ వేరియంట్ల కలయికగా గుర్తించారు. ఈ రెండింటికి BA1, BA2 అనే పేర్లు పెట్టారు. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్ టెర్మినల్‌లో ఇద్దరు ప్రయాణికులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి ఈ కొత్త వేరియంట్ సోకిందని నిర్ధారించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచానికి ఇంకా తెలియదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

లక్షణాలివే :
ఇజ్రాయెల్‌లో కనుగొన్న ఈ కొత్త కరోనా వేరియంట్ సోకిన బాధితుల్లో ఈ తరహా లక్షణాలు ఉంటాయని గుర్తించారు. ముఖ్యంగా లో-ఫీవర్, కండరాల నొప్పులు, తలనొప్పితో పాటు ఇతర తేలికపాటి లక్షణాలు ఉంటాయని గుర్తించారు. ఈ వేరియంట్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, అయితే ప్రస్తుతానికి ఈ వేరియంట్‌కు ప్రత్యేక చికిత్స అవసరం లేదని మంత్రిత్వ శాఖ తెలిపినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

Israel Covid Variant Israel Claims New Covid 19 Variant Detected. What Are The Symptoms

ఇజ్రాయెల్‌లో ఈ వేరియంట్ పుట్టిందా? :
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్‌మన్ యాష్ ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ ఇజ్రాయెల్‌లో ఉద్భవించి ఉండవచ్చు. ఇజ్రాయెల్‌లో ఫ్లైట్ ఎక్కే ముందు ఆ ఇద్దరు ప్రయాణికులకు ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంది. ఈ వేరియంట్ ఇక్కడే ఉద్భవించి ఉండవచ్చునని నాచ్‌మన్ యాష్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వేరియంట్ అర్థం ఏంటో తమకు ఇంకా తెలియదని ఆయన స్పష్టం చేశారు.

ఇది ప్రాణాంతకమా? :
ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చునని ఇజ్రాయెల్ ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఈ కొత్త వేరియంట్ కొత్త ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల కలయికతోనే ఈ కొత్త వేరియంట్ ఉద్భవించి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఈ వేరియంట్ తీవ్రమైన కేసులకు దారితీస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

Read Also : Covid New Variant: ఇజ్రాయెల్ లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్

ట్రెండింగ్ వార్తలు