Covid New Variant: ఇజ్రాయెల్ లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్

ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్ కనుగొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు కనిపించాయని వైద్యులు వెల్లడించినట్లు AFP న్యూస్ ఏజెన్సీ..

Covid New Variant: ఇజ్రాయెల్ లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్

Covid Variant

Covid New Variant: ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్ కనుగొన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బుధవారం ఇద్దరు వ్యక్తుల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు కనిపించాయని వైద్యులు వెల్లడించినట్లు AFP న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

కొన్ని నెలల కిందట కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ ఉప వేరియంట్‌గా గుర్తించి దీనికి BA1, BA2 అనే పేర్లు పెట్టారు. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్ టెర్మినల్‌లో ఇద్దరు ప్రయాణికులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాల్లో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు.

ఈ మేరకు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ రకం గురించి ప్రపంచానికి ఇంకా తెలియదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also : డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్.. లక్షణాలేంటి? నిపుణుల మాటల్లోనే..!

‘కేసులు బయటపడ్డ వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమయంలో వారికి ప్రత్యేక వైద్యం అందించనవసరం లేదు” అని వైద్యులు అంటున్నారు.

మంగళవారం, ఇజ్రాయెల్‌లో 6వేల 310 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 10.9 శాతం మందికి పాజిటివ్‌ తేలింది. ఇజ్రాయెల్ 9.2 మిలియన్ల జనాభాలో, 4 మిలియన్ల కంటే ఎక్కువ మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ ముగిసింది.