Cinnamon Milk : రాత్రి నిద్రకు ముందు ఒక్క గ్లాసు దాల్చిన చెక్క పాలు తాగితే చాలు!

దాల్చిన చెక్క‌లో పాలీఫినాల్స్‌ అనే శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శ‌రీరంలో ఉన్న ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తిని పెంచడంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Cinnamon Milk : రాత్రి నిద్రకు ముందు ఒక్క గ్లాసు దాల్చిన చెక్క పాలు తాగితే చాలు!

cinnamon milk

Updated On : November 5, 2022 / 8:42 PM IST

Cinnamon Milk : దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. వంట‌కాల్లో దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు. టైప్-2 మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. ఆర్థరైటిస్, ఎముక సమస్యల నుంచి బైటపడేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మం మచ్చలు లేకుండా చేస్తుంది.

దాల్చిన చెక్క‌లో పాలీఫినాల్స్‌ అనే శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శ‌రీరంలో ఉన్న ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తిని పెంచడంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు దాల్చిన చెక్క‌ను నేరుగా తిన్నా లేదా దాల్చిన చెక్క పొడిని నీటిలో క‌లుపుకుని తాగాలి. ఇలా చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

అంతే కాకుండా దాల్చిన చెక్కపొడిని పాలతో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు దాల్చిన చెక్క పొడి కలిపిన పాలు తాగితే రాత్రి నిద్ర బాగా పడుతుంది.

జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది. దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.