Close Up Of Human Hands Holding Human Heart
Heart Disease : గుండె పోటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, ఆహారంలో మార్పులు, ఒత్తిడి వంటి వాటి వల్ల చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఎక్కువ శారీరక శ్రమలేని వారిలో రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారిలో గుండె సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె , రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి. మద్యం, ధూమపానం అలవాట్లు కూడా ఇందుకు కారణమే.
మనిషి జీవితంలో అతి ముఖ్యమైన అవయవం గుండె ఇది పని చేయకపోతే ప్రాణం పోయినట్లే. కాబట్టి గుండె జబ్బుల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గుండె జబ్బులకైనా, మరే ఇతర జబ్బుల కైనా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విష పదార్థాలే కారణం. అవి శరీరానికి హాని చేస్తాయి. గుండె రక్తనాళాల్లో అడ్డుంకులు రావడానికి కూడా శరీరంలోని విషపదార్థాలే కారణం. రక్తస్రావం వల్ల రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు రావడానికి దారి తీస్తోంది.
రక్తప్రసరణలో అంతరాయాలేవీ రాకుండా సాఫీగా సాగాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగటం మంచిది. ఆహారంలో సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, వంటివి తీసుకోవాలి. శరీరం బరువును బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా, కొర్రలు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలకు తీసుకోవాలి. ఒకే రకమైన ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరం అందులోని పోషకాలను సంగ్రహణ సరిగా జరగదు.
పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పీచుపదార్థాల్లో జీర్ణమయ్యేవి, జీర్ణం కానివి అంటూ రెండు రకాలుగా ఉంటాయి. వీటిలో జీర్ణమయ్యే పీచుపదార్థం ఎక్కువ మేలు కలుగుతుంది. బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్ తినకండి. వీటిలో కొవ్వు శాతం అధికం.
ఉప్పు, మసాలాలు అతిగా వాడటం, రసాయనాలు, వస్తువుల్ని తినటం ఏమాత్రం మంచిదికాదని గ్రహించాలి. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటి కొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు కలిగిస్తాయి. రోజువారి వ్యాయామాలు చేయటం మంచిది. ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. సైకిల్ తొక్కడం, వాకింగ్ చేయాలి. స్థూలకాయం ను తగ్గించుకోవాలి. ఇలా చేస్తే గుండె జబ్బులు దరి చేరకుండా చూసుకోవచ్చు.