Eating Corn : కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్న

మొక్క గింజలతో తయారైన నూనెలో ఫైటోస్టెరాల్స్‌ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేందు ఉపకరిస్తుంది. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్‌ అనే విటమిన్‌ ఉంటుంది.

Sweet Corn

Eating Corn :  మొక్కజొన్న పోషకాల గనిగా చెప్పవచ్చు. ఈ గింజల్లో నీటిలో కరగని పీచు పదార్దం ఉంటుంది. విటమిన్‌ సి,మెగ్నీషియం, ఫోలేట్‌, ప్రొటీన్‌, క్యాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఏ వంటి పోషకాలు ఉంటాయి. మొక్కజొన్నలో కరగని పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొక్కజొన్నలోని పీచు ప్రిబయాటిక్‌గా పనిచేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగటానికి తోడ్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా మొక్కజొన్నను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇవి పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా రక్షిస్తాయి.

READ ALSO : Burn Belly Fat : ఈమూడు ఆహారాలు పొట్ట వద్ద కొవ్వును కరిగించటంతోపాటు బరువును తగ్గిస్తాయి

మొక్కజొన్న గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు (ల్యుటీన్‌, జియాగ్జాంతీన్‌) కంటి చూపు మెరుగుపడటానికి, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనంలో తేలింది. దీర్ఘకాల వాపు, గుండెజబ్బు, క్యాన్సర్ల వంటి వాటి నుండి మనల్ని రక్షిస్తాయి. రోగనిరోధకవ్యవస్థ సక్రమంగా పనిచేయటానికీ , వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడానికి సాయం చేస్తాయి. గింజల్లోని సహజ చక్కెరలే మొక్కజొన్నకు తీపి రుచిని కలిగిస్తాయి. చక్కెర మోతాదు తక్కువే. ఒక మొక్కజొన్న పొత్తులో సుమారు 4 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది.

READ ALSO : Okra Crop : అధిక దిగుబడుల కోసం బెండసాగులో యాజమాన్య పద్ధతులు

మొక్క గింజలతో తయారైన నూనెలో ఫైటోస్టెరాల్స్‌ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేందు ఉపకరిస్తుంది. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్‌ అనే విటమిన్‌ ఉంటుంది. దీనిలో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. మొక్కజొన్న పీచు కిడ్నీలలోని ప్రమాదకర టాక్సిన్స్‌ను తొలగించడానికి, కిడ్నీలో రాళ్లను తొలగించడానికి సహాయపడుతుంది.

READ ALSO : Pest Control : పురుగుల సంతతిని అరికట్టటంతోపాటు, ఉధృతి తగ్గించే సరికొత్త టెక్నాలజీ..

మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకుని తాగితే మూత్రపిండాలలో పేరుకుపోయిన టాక్సిన్స్‌, నైట్రేట్‌లు బయటకు వెళతాయి. యూరినరీ ట్రాక్‌‌ ఇన్ఫెక్షన్‌, మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గించటంలో మొక్కజొన్న సహాయపడుతుంది. ఇన్సులిన్‌ హార్మోన్‌ను నియంత్రించే గుణాలు దీనిలో ఉన్నాయి. మొక్కజొన్నను కాల్చుకొని, ఉడికించి, పచ్చిగా తినొచ్చు. కార్న్‌ ఫ్లేక్స్‌, పాప్‌కార్న్‌ రూపంలో తీసుకోవచ్చు.

గమినక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య పరమైన సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.