Burn Belly Fat : ఈమూడు ఆహారాలు పొట్ట వద్ద కొవ్వును కరిగించటంతోపాటు బరువును తగ్గిస్తాయి
మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కొవ్వు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవటానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి.

belly fat
Burn Belly Fat : వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పురుషులు పొట్ట పెరుగుదలను పెద్దగా పట్టించుకోరు. అయితే మహిళల్లో మాత్రం ఇది పెద్ద సమస్యగానే కనిపిస్తుంది. శరీరాకృతినే మార్చేసి వయసు అందానికే కాదు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు సంగతి పక్కనపెడితే ప్రధానంగా పొట్ట వద్ద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వాటికి కారణమౌతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు , ఆహారాలను తీసుకోవటం ద్వారా తగ్గించు కోవచ్చు. ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు పొట్ట కొవ్వును వేగంగా కరిగించటంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
READ ALSO : Low Fat vs Low Carb : తక్కువ కొవ్వు vs తక్కువ కార్బ్.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది?
1. అవిసె గింజలు; ఆరోగ్యానికి అవిసె గింజలు అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. గుండెకు మేలు చేస్తాయి. పొట్ట కరిగించడానికి అవిసె గింజలను రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు. అవిసె గింజలను నానబెట్టి ఉదయాన్నే తింటే అవిసె గింజలల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయి. అవిసె గింజలను స్మూతీస్, సలాడ్స్, ఓవర్ నైట్ ఓట్స్, మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా కొద్ది రోజుల్లోనే పొట్ట వద్ద కొవ్వును కరుగుతుంది.
2. మిరియాలు; మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కొవ్వు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవటానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి. అధిక బరువును అదుపులో ఉంచటంతోపాటుగా కొవ్వు, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. రోజుకు నాలుగు మిరియాలను దంచి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవటం ద్వారా పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !
3. పసుపు; శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరచడానికి , పొట్ట వద్ద కొవ్వు ను నిరోధించడానికి పసుపు బాగా దోహదం చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు పసుపును నిత్యం తీసుకోకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధించటంలో పసుపు బాగా ఉపకరిస్తుంది. గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలుపుకుని రోజూ రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఇలా రోజు చేయటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.