Headphones Increase Bacteria : అతిగా హెడ్ ఫోన్స్ వాడితే.. చెవిలో ఇలా జరుగుతుందని మీకు తెలుసా?

చేతిలో సెల్ ఫోన్.. చెవిలో హెడ్ ఫోన్ కంపల్సరీగా ఉండాల్సిందే. హెడ్ ఫోన్స్ వాడుతున్నారు సరే.. హెడ్ ఫోన్స్ వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుందని మీకు తెలుసా?

Headphones Increase Bacteria

Headphones Increase Bacteria : ఎక్కడకి వెళ్లినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్. ఫోన్ మాట్లాడినా, మ్యూజిక్, సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్స్ కావాల్సిందే. హెడ్ ఫోన్స్ మన చెవుల్లో బ్యాక్టీరియాను పెంచుతాయని మీకు తెలుసా?

Watery Ears : చెవిలో నీరు కారుతుందా? చెవుడు వచ్చే ప్రమాదం

చాలామంది హెడ్ ఫోన్స్ వాడుతుంటారు. వాటి ద్వారా సులభంగా బ్యాక్టీరియా చెవిలోకి ప్రవేశిస్తుందనే విషయాన్ని మాత్రం పట్టించుకోరు. హెడ్ ఫోన్స్‌కి అంటుకునే దుమ్ము, ధూళి చెవిలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అందుకే హెడ్ ఫోన్స్ తీసాకా చెవిని శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు. చెవిలో బ్యాక్టీరియా చేరితే ఒకలాంటి ఇరిటేషన్‌తో పాటు అసౌకర్యంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. చెవిలో ఏదో ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో చాలామంది హెడ్ ఫోన్స్ వాడటం మానేస్తుంటారు. చెవిలో చేరిన బ్యాక్టీరియా కారణంగా అలా జరుగుతుందట.

నమ్మకాలు నిజాలు :  చెవిలో కాటన్‌బడ్‌ని ఎందుకు పెట్టొద్దు?

హెడ్ ఫోన్‌లను తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్ కూడా చెవి పరిశుభ్రతపై ప్రభావం చూపిస్తాయి. ప్లాస్టిక్ లేదా తోలు వంటి కొన్ని పదార్ధాలతో తయారు చేసిన మెటీరియల్ కారణంగా చెవి ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. హెడ్ ఫోన్‌లు ఎక్కువ సేపు వాడటం మంచిది కాదు. ఒకవేళ వాడినా తక్కువ శబ్దంతో వినాలి. హెడ్ ఫోన్స్ అతిగా వాడటం వల్ల చెవిలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతో చెవి ద్వారంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్‌కి కారణమవుతుంది. అందువల్ల హడ్ ఫోన్స్ వాడేవారు తరచుగా చెవులను శుభ్రం చేసుకోవడం, మంచి మెటీరియల్‌తో తయారు చేసిన హెడ్ ఫోన్‌లను వాడటం, తక్కువ వాల్యూమ్‌లో వినడం వంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.