నమ్మకాలు నిజాలు :  చెవిలో కాటన్‌బడ్‌ని ఎందుకు పెట్టొద్దు?

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 12:01 PM IST
నమ్మకాలు నిజాలు :  చెవిలో కాటన్‌బడ్‌ని ఎందుకు పెట్టొద్దు?

స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేయాలని అనుకుంటాం. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. మరి చెవిలో ఉన్న ఇయర్ వాక్స్ వల్ల ఏమీ కాదా..? 

చెవిలో గులిమి లేదా ఇయర్ వాక్స్ తీయడం కోసం ఎక్కువ మంది కాటన్ బడ్‌ని ఉపయోగిస్తుంటారు. కొందరు పేపర్‌ని చుట్టలా చుట్టి గానీ, క్లాత్‌ని గానీ పెట్టి, చెవిలో గులిమి తీస్తుంటారు. కానీ దీనివల్ల చెవికి నష్టమే గానీ లాభం ఏమాత్రం లేదు. 

కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్‌ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. 
తేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి. 
దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. 
– 
నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. 
యటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. 
– శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. 
–  చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది. 
మరి ఇయర్ వాక్స్‌ని ఏం చేయాలి?
 దాని జోలికి వెళ్లకుండా ఉండడమే కరెక్ట్. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టవద్దు. చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. 
 ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఇఎన్ టి డాక్టర్‌ను కలవండి.