GST Reward Scheme : మీ బిల్లులు ఫోటో తీసి కోటి రూపాయలు సంపాదించవచ్చు.. అదెలాగో తెలుసుకోండి

మీరు ఏ షాపింగ్ చేసినా.. హోటళ్లలో ఫుడ్ తిన్నా ఆ బిల్లులపై GST ఉందో లేదో చూసుకోండి. అలా ప్రతి నెల జమ చేసిన 25 బిల్లులతో డబ్బులు సంపాదించవచ్చును. అదెలా అంటారా? చదవండి.

GST Reward Scheme

GST Reward Scheme : సాధారణంగా షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమాలకు వెళ్లినపుడు బిల్లుల్ని పడేస్తుంటాం. వాటిని పడేయకుండా ప్రతి బిల్లును ఫోటో తీసి దాదాపు కోటి రూపాయల దాకా సంపాదించే స్కీమ్ గురించి మీకు తెలుసా? చదవండి.

భారతదేశంలోని సెంట్రలో బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ కస్టమ్స్ (CBIC) ‘మేరా బిల్ మేరా అధికార్’ అనే స్కీమ్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా GST ఛార్జ్ చేయదగిన కొనుగోళ్లపై ఇన్వాయిస్‌లను అడిగే అలవాటును ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దాంతో పాటు జీఎస్టీ బిల్ ఎవరైతే తప్పుగా వేస్తున్నారో? ఎస్కేప్ అవుతున్నారో? వారిని పట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ ఇలా ముందుకు వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులకు నగదు బహుమతిని ఇస్తోంది. నెలవారీగా, త్రైమాసిక లాటరీల ద్వారా ఈ బహుమతులు పంపిణీ చేస్తారు. అసలు ఈ స్కీమ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి?

GST Collection: నిన్న GDP నుంచి గుడ్ న్యూస్ వచ్చిందో లేదో.. ఈరోజు GST మరో గుడ్ న్యూస్

షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమాలకు వెళ్లినపుడు మీ దగ్గర ఉన్న ఏ బిల్లులో అయితే జీఎస్టీ ఉంటుందో దానిని ఫోటోలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఇన్వాయిస్‌లను అప్ లోడ్ చేయడానికి ‘Mera Bill Mera Adhikar’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా https://web.merabill.gst.gov.in/login అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇలా అప్‌లోడ్ చేయడం ద్వారా వినియోగదారులు మూడు విభాగాల్లో బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.10,000 , రూ. 10 లక్షలు, కోటి రూపాయలు.. నెలవారీ మరియు త్రైమాసిక డ్రాల ద్వారా ఈ మొత్తాన్ని వినియోగదారులకు అందజేస్తారు.

బిజినెస్ టు కన్జ్యూమర్ లావాదేవీలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు మాత్రమే అప్‌లోడ్ చేయబడటానికి అనుమతించబడతాయి. ప్రతి నెల 5 తేదీ లోపు 25 వరకూ ఇన్వాయిస్‌లను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చును. కనీసం ఇన్వాయిస్ మొత్తం రూ.200 ఉండాలి. పెట్రోలు రసీదులు GST పరిధిలోకి రానందున అర్హత కాదు. LPG సిలెండర్ల ఇన్వాయిస్‌లు ఈ స్కీమ్‌లో అప్ లోడ్ చేయడానికి చెల్లుబాటు అవుతాయి. ఏ రాష్ట్రంలో బిల్లు చేసినా ఆ రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలులో ఉందో లేదో తెలుసుకుని ఆ ఇన్వాయిస్‌లను మాత్రమే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Multiplex Food : GST తగ్గింది.. మరి మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు తగ్గుతాయా?

విజేతలను SMS ద్వారా లేదా మొబైల్ యాప్ నోటిఫికేషన్లు, వెబ్ పోర్టల్ ప్రకటనల ద్వారా ప్రకటిస్తారు. రివార్డు మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. విజేతలు తప్పనిసరిగా PAN నంబర్ వివరాలతో పాటు బ్యాంకు డీటెయిల్స్ వెబ్ పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేసుకుని ఉండాలి. ఆలస్యమెందుకు ఈ స్కీమ్‌లో వెంటనే చేరిపోండి. విజేతలు కండి.