Monsoon : వానాకాలం ఆరోగ్యం జాగ్రత్త!
వర్షకాలం సమయంలో మాంసాహారం జోలికి వెళ్ళక పోవటమే మంచిది. శాఖాహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మాంసాహారం తినటం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Monsoon
Monsoon : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వేళ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది. ఈసమయంలో అనేక ఆరోగ్య సమస్యలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వర్షపు నీటి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాగే నీటితో వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కాచి చల్చాల్చిన తరువాతనే నీటిని తాగటం మంచిది. నీటిని ఫ్లిల్టర్ చేసుకోవాలి. తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట వండి ఆహార పదార్ధాలకంటే ఇంట్లోనే తయారైన వాటిని తినటం మంచిది. చల్లారి ఆహారాన్ని తినటం, పదేపదే వేడి చేసుకు తినటం వంటివి చేయరాదు. అప్పటికప్పుడు వండుకుని వేడిగా ఉన్న ఆహారాన్ని తినటం మంచిది.
వర్షకాలం సమయంలో మాంసాహారం జోలికి వెళ్ళక పోవటమే మంచిది. శాఖాహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మాంసాహారం తినటం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ఉడికించిని మాంసాహారం తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వానాకాలంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. నీళ్లు నిలిచి ఉండటం, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు వంటివి ఉంటే వెంటనే తొలగించుకోవాలి. ఇవి దోమలకు ఆవాసాలుగా మారతాయి. దోమలను నిరోధించేందుకు, పొగ, మస్కిటో కాయిల్స్ కు బదులుగా దోమ తెరలను వాడుకోవటం ఉత్తమం. దోమలు కుట్టకుండా శరీరం కనబడకుండా ఉండే దుస్తులను ధరించాలి.
వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. మూత్ర విసర్జనకు ముందు, తరువాత చేతులు డిటర్జెంట్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. దీర్ఘాకాలిక ఇన్ ఫెక్షన్లతో బాధపడేవారు వర్షాల్లో తడవకూడదు. ఇలాంటి వారు వర్షాల్లో తడవటం వల్ల ఆరోగ్య పరంగా సమస్యలు పెరగటంతోపాటు నిమోనియా వంటి ఇన్ ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి.