Malaysia Canine Coronavirus : మలేషియా పేషెంట్లలో కొత్త కరోనావైరస్.. కుక్కల నుంచే సంక్రమించిందా?

మలేషియాలోని ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో చాలామందిలో కొత్తరకం కరోనావైరస్ బయటపడింది. ఈ కొత్త కరోనావైరస్ కుక్కల నుంచి వ్యాపించి ఉండొచ్చునని పరిశోధక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Canine Coronavirus in Malaysian Patients : మలేషియాలోని ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో చాలామందిలో కొత్తరకం కరోనావైరస్ బయటపడింది. ఈ కొత్త కరోనావైరస్ కుక్కల నుంచి వ్యాపించి ఉండొచ్చునని పరిశోధక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 20ఏళ్లలో కొత్త కరోనావైరస్ జాతులు జంతువుల నుంచి తరచుగా వ్యాపిస్తుంటాయి. 2002లో SARS-CoV అనే వైరస్ క్షీరదాల నుంచి మనుషులకు వ్యాపించింది. 10ఏళ్ల తర్వాత MERS అనే మహమ్మారి ఒంటెల నుంచి వ్యాపించింది.

2019లో పుట్టుకొచ్చిన SARS-Cov-2 కొవిడ్ వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. అసలు ఈ కరోనావైరస్ మూలం ఎక్కడిదో ఇప్పటికీ సైంటిస్టులు కచ్చితంగా తేల్చలేకపోయారు. కరోనావైరస్ లు విజృంభించడం అరుదు కాదు.. కొన్ని దశబ్దాలుగా ఈ తరహా కరోనావైరస్‌లు విజృంభిస్తూనే ఉన్నాయి. అయితే.. కొత్తగా మరో కరోనావైరస్ జంతువుల నుంచి మానువులకు సంక్రమించిందని సైంటిస్టులు అంటున్నారు. అందులోనూ కుక్కలే ఈ వైరస్ కు మూలం అయి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత ఏడాదిలోనే తొలుత అనేక కరోనావైరస్ బాధితుల శాంపిల్స్ పరీక్షించారు.

వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరినవారిలో ఎక్కువగా పిల్లలే న్యూమోనియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. మానువుల్లో వ్యాపించిన కరోనావైరస్ జాతుల్లో ఇది ఎనిమిదోవది కావొచ్చునని పరిశోధక బృందం తెలిపింది. మలేషియాలోని సరవక్ ఆస్పత్రిలోని కొంతమంది బాధితుల శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. నాజల్ స్వాబ్ ద్వారా 2017 నుంచి 2018 మధ్య కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించారు. వీరిందరిలోనూ న్యూమోనియా ఆనవాళ్లే కనిపించాయి. 301 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 8 మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపించాయి. శ్వాసకోస పైభాగంలోనే ఈ కరోనావైరస్ ఉందని గుర్తించారు. ఈ కొత్త రకం కెనైన్ కరోనావైరస్ కుక్కుల్లో ఉంటుందని గుర్తించారు. ఈ రకం వైరస్ సీక్వెన్సులు సాధారణంగా పిల్లులు, పందుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉంది.

కానీ, కుక్కల నుంచి నేరుగా మానువులకు సంక్రమించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కనైన్ కరోనావైరస్ అనే జన్యువు ఉంటుందని, ఇదే జంతువుల నుంచి మనుషుల్లోకి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన ఈ కొత్త రకం కరోనావైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందనడంలో ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. ఈ వైరస్ మనుషులకు ఎలా సోకిందో కచ్చితంగా తెలియదని, ఒకవేళ వైరస్ సోకిన జంతువుల నుంచి నేరుగా వైరస్ మనుషులకు వ్యాపించి ఉంటుందో తేలాల్సి ఉందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు