'no Need To Panic' Expert Says As Who Records 80 Monkeypox Cases In 11 Countries
Monkeypox cases : ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బ్రిటన్ నుంచి మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది. అక్కడి నుంచి పలు దేశాలకు మంకీ పాక్స్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో 20, స్పెయిన్ ఏకంగా 23 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ అధిక కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ మంకీ పాక్స్ కేసుల పెరుగుదలపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెచ్‌ఐవీ నిపుణుడు, వైరాలజిస్ట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా అన్నారు. యూరప్ అమెరికాలో విజృంభిస్తున్న మంకీపాక్స్ వ్యాప్తిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వైరస్ మహమ్మారి అవుతుందని ఎవరూ చెప్పలేమన్నారు. చైనాలోని వుహాన్ నుంచి ప్రపంచం మొత్తానికి వ్యాపించిన కరోనావైరస్ ఎలా వ్యాపించిందో గుర్తుచేశారు. మంకీ పాక్స్ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ICMRను ఆదేశించారు.
‘no Need To Panic’ Expert Says As Who Records 80 Monkeypox Cases In 11 Countries
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుందని అంచనా వేసింది. స్వలింగ సంపర్కుల మధ్య వ్యాప్తి చెందుతుందని UKHSA హెచ్చరించిన నేపథ్యంలో.. కొత్త వైరస్ పై UN హెల్త్ ఏజెన్సీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. WHO ఇప్పటివరకు 11 దేశాలలో 80 మంకీ పాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయని WHO నిర్ధారించింది. ఇప్పటి వరకు దాదాపు 80 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. మరో 50 కేసులను నిర్ధారించాల్సి ఉంది. రానున్న రోజుల్లో మంకీ పాక్స్ కేసులు మరిన్ని నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
మంకీపాక్స్ అనేక దేశాల్లోని కొన్ని జంతువుల జనాభాలో స్థానిక ప్రజలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని WHO తెలిపింది. ఈ వ్యాప్తికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తున్నామని WHO తెలిపింది. మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వైరస్). వైద్యపరంగా ఈ వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ.. గతంలో మశూచి రోగులలో కనిపించే లక్షణాలతో సమానంగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ సోకినవారిలో సాధారణంగా జ్వరం, దద్దుర్లు, చర్మంపై వాపు కణుపులు కనిపిస్తుంటాయి.
Read Also : Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన కేంద్రం