Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన కేంద్రం

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలికేసు బయటపడిన బ్రిటన్ నుంచి ఈ వ్యాధి వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గత వారం స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా...

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన కేంద్రం

Monkeypox (2)

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలికేసు బయటపడిన బ్రిటన్ నుంచి ఈ వ్యాధి వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గత వారం స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ దేశంలో 20, స్పెయిన్ లో ఏకంగా 23 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే అధిక కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి.. లక్షణాలేంటి..?

మంకీపాక్స్ కేసులు ఎక్కువగా ఆఫ్రికాకు పరిమితం అవుతాయి. అరుదుగా ఇతర ప్రాంతాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బ్రిటన్ లో నమోదైన తొలికేసుకు సంబంధించిన మూలాలు నైజీరియాలో ఉన్నాయి. తాజా కేసులకు ఆప్రికాతో సంబంధం లేకపోవటం, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే మంకీపాక్స్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు టాప్ యూరప్ ఆరోగ్య అధికారి హెచ్చరించారు. ఇప్పటికే ఎనిమిది యూరోపియన్ దేశాలకు వైరస్ వ్యాపించినందున, రాబోయే రోజుల్లో మంకీపాక్స్ విజృంభించే అవకాశాలు ఉన్నట్లు యూరోపియన్ ఆరోగ్య అధికారి ఒకరు హెచ్చరించారు.

Monkeypox: అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ యొక్క చీఫ్ మెడికల్ అడ్వైజర్, సుసాన్ హాప్కిన్స్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మంకీపాక్స్ వ్యాధి పెరుగుదల కొనసాగుతుందని ఆమె తెలిపారు. యూకే ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మంకీపాక్స్ కేసుల పెరుగుదలపై ట్వీట్ చేశారు. మంకీపాక్స్ సోకిన వారిలో చాలా మంది స్వల్ప అనారోగ్యంతోనే బాధపడుతున్నారని అన్నారు. మంకీపాక్స్ సోకిన వారు ప్రాణాలు కోల్పోవటం అరుదుగా జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే అనారోగ్య ప్రయాణికులను ఐసోలేషన్ చేసి వారి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని బీఎస్ఎల్-4కు పంపాలని వారికి ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా వెల్లడించారు.