Swiggy CEO bats for work-life balance
Swiggy CEO Hustle Culture : అసలే ఉరుకుల పరుగుల జీవితం. దానికి తోడు పని ఒత్తిడి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి. ఫలితంగా మానసిక ఒత్తిడితో అనేక అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఆఫీసులో ఓవర్ టైమ్ వర్క్ లోడ్ కారణంగా చాలామంది కాస్త సమయం దొరికితే చాలు విశ్రాంతి తీసుకుందామని భావిస్తుంటారు.
ఆఫీసులో పని ఒత్తిళ్లు- ఇటు వ్యక్తిగత జీవిత వ్యవహారాలు వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం ప్రతిఒక్కరికీ పెద్ద సవాల్‌గా మారిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్ వర్క్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ తప్పక చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు స్విగ్గీ సీఈఓ రోహిత్ కుమార్.. హస్టిల్ కల్చర్ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హస్టిల్ కల్చర్ గురించి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
స్విగ్గీ ఫుడ్ సీఈవో రోహిత్ కపూర్ హస్టిల్ కల్చర్‌ను విమర్శించారు. ఉద్యోగుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలపై ఈ హస్టిల్ కల్చర్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆయన ప్రస్తావించారు. బెంగళూరులో జరిగిన ఈవెంట్లో ఓవరల్ టైమ్ వర్క్ చేయడాన్ని బహిరంగంగా విమర్శించారు. ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి నొక్కి చెప్పారు. స్విగ్గీ సీఈఓ రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వర్క్‌ప్లేస్‌లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి పెద్ద చర్చ మొదలైంది.
హస్టిల్ కల్చర్ అంటే ఏమిటి? :
ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులను పొగడడం, వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును పణంగా పెట్టి ఉద్యోగంలో కష్టపడడం హస్టిల్ కల్చర్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ పని విధానం అనేక పరిశ్రమలలో కొనసాగుతోంది. తన పరిశీలనలో ఒకదాన్ని షేర్ చేస్తూ.. రాత్రి 3 గంటలకు కూర్చున్న ఉద్యోగులు మధ్యాహ్నం 1 గంటకు కార్యాలయానికి వస్తారని చెప్పరని అన్నారు. స్విగ్గీ సీఈవో చేసిన ఈ ప్రకటన నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ప్రకటనతో హస్టిల్ కల్చర్‌లో ఎక్కువ గంటలు పనిచేయడం రొమాంటిక్‌గా ఉందని, అయితే ఉద్యోగి ఉత్పాదకత, అతని వ్యక్తిగత జీవితాన్ని పరిగణనలోకి తీసుకోలేదని రోహిత్ తెలియజేప్పాలనుకున్నారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను సపోర్ట్ చేయండి :
విజయాన్ని సాధించడానికి కష్టపడండి.. కానీ, మీ జీవితాన్ని పణంగా పెట్టడం ద్వారా కాదు. కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారితో సమయాన్ని గడపాలని కపూర్ మెసేజ్ ఇచ్చారు. గంటల కొద్దీ పని చేయాల్సిన సమయం వస్తుందని, అయితే ఇది అలవాటుగా మారకూడదని అన్నారు.
కపూర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ స్టేట్‌మెంట్‌లు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 70 గంటలు పని చేయాలనే ప్రకటనను గుర్తు చేస్తూ.. ఈ వీడియో చూసిన తర్వాత నారాయణ మూర్తికి గుండెపోటు వస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సమస్యపై మరింత చర్చ జరగాలని మరో యూజర్ కామెంట్ చేశారు.
స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ గత రెండు దశాబ్దాలగా కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ప్రయాణం 2000లో మెకిన్సే అండ్ కంపెనీలో ప్రారంభమైంది. ఆ తర్వాత మాక్స్ ఇండియా లిమిటెడ్, మాక్స్ హెల్త్‌కేర్, ఓయోలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. రోహిత్ కపూర్ 2022లో ఫుడ్ మార్కెట్ ప్లేస్ సీఈఓగా స్విగ్గీలో చేరారు.
Read Also : Mini Moon : ఖగోళ అద్భుతం.. నేటి నుంచి భూమికి ఇద్దరు చంద్రులు.. 2 నెలలు మనతోనే.. భారత్‌లో కూడా కనిపిస్తుందా?